Mahesh Babu Son-in-Law: సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న మహేష్ బాబు వరకు ఇండస్ట్రీలో వల్ల హవా ను కొనసాగిస్తున్న వాళ్లే కావడం విశేషం…ఇక రీసెంట్ గా రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సైతం ఇండస్ట్రికి హీరోగా పరిచయమయ్యాడు. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ మూవీ తో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు. కానీ నటుడు తన సత్తా చాటుకున్నాడు. తనకి టాప్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి అంటూ ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా జయకృష్ణ మహేష్ బాబు మాదిరిగా టాప్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. తన కొడుకు అయిన చరిత్ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే తను యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. తను మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా తన గురించిన న్యూస్ లు విపరీతంగా వినిపిస్తున్నాయి.
చరిత్ తప్పకుండా స్టార్ హీరో అవుతాడు అంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అతను కనిపించిన ప్రతిసారి జూనియర్ మహేష్ బాబు లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతను కనిపించిన వీడియో కి మహేష్ బాబు బ్యా గ్రౌండ్ సాంగ్ పెట్టి ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మహేష్ బాబు తర్వాత ఆ ప్లేస్ ని భర్తీ చేయగలిగే కెపాసిటీ చరిత్ కి మాత్రమే ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తను తొందర్లోనే ఇంట్రెస్ట్ కి రాబోతున్నాడు కాబట్టి తన మొదటి సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక చరిత్ కి కథలు వినిపించడానికి చాలామంది దర్శకులు పోటీ పడుతున్నారట. అందులో కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా సుధీర్ బాబు మాత్రం మరో మూడు సంవత్సరాల్లో చరిత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ క్లారిటి ఇచ్చాడు…