Korean Kanakaraju: వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ ని అనుసరిస్తూ చేసిన కామెడీ పై నందమూరి ఫ్యాన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇమిటేషన్ చేయడం లో తప్పు లేదు, నవంబర్ లోనే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించామని అంటున్నారు , ఈమధ్య కాలం లో అదే సన్నివేశాన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా లో తిప్పారు. ఇదంతా నాగబాబు తన పీఆర్ టీం తో ముందుగానే ప్లాన్ చేసి చేసారని , ఇది కచ్చితంగా తప్పేనని నందమూరి ఫ్యాన్స్ వాదన.
కానీ వరుణ్ తేజ్ మాత్రం మేము ఎవరినీ అగౌరవపర్చలేదని , ఆ ఉద్దేశ్యమే మాకు లేదని , గతం లో నేను కళ్యాణ్ బాబాయ్ ‘వకీల్ సాబ్’ మూవీ లోని సన్నివేశాలను కూడా నా సినిమాల్లో ఇమిటేట్ చేసానని, అది కేవలం ఫన్ కోసం చేసిందే తప్ప , ఎవ్వరినీ కావాలని టార్గెట్ చెయ్యలేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం నమ్మడం లేదు. అయితే ఈ సన్నివేశాన్ని పెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉండొచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అదేమిటంటే గత అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ చిరంజీవి ని అవమానిస్తూ మాట్లాడడం మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు , నాగబాబు కి కూడా తీవ్రమైన కోపాన్ని తెప్పించి ఉండొచ్చని , అందుకే నాగబాబు సీనియర్ ఎన్టీఆర్ సన్నివేశం స్పూఫ్ ని పెట్టించి ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇవన్నీ కేవలం ఆరోపణలు , ఊహాగానాలు మాత్రమే.
స్వయంగా హీరో , డైరెక్టర్ తమకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ‘కొరియన్ కనకరాజు’ లో కేవలం సీనియర్ ఎన్టీఆర్ ని మాత్రమే కాదు , చిరంజీవి , సూపర్ స్టార్ కృష్ణ, షారుఖ్ ఖాన్ వంటి వారిని కూడా ఇమిటేట్ చేస్తాడు కమెడియన్ సత్య. అంటే వరుణ్ తేజ్ స్వయంగా తన పెద్దనాన్న చిరంజీవి ని ట్రోల్ చేసే ఉద్దేశ్యం తో ఆ సన్నివేశాన్ని తీసాడా? , ఇది కేవలం ఫన్ కోసం తీసినది గానే చూడొచ్చు, ఇంత గొడవ చెయ్యాల్సిన అవసరం లేదని మరికొందరి విశ్లేషకుల వాదన. ఈ సెగ ఇప్పటికీ తగ్గలేదు , సోషల్ మీడియా లో ఇరు వర్గాల మధ్య ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి వరకు ఈ అంశం పై ట్రోల్స్ నడుస్తాయి చూడాలి.