Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam 2: 'కార్తీక దీపం 2' సీరియల్ విలన్ నెల సంపాదన ఎంతో తెలిస్తే...

Karthika Deepam 2: ‘కార్తీక దీపం 2’ సీరియల్ విలన్ నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరేళ్ళబెడుతారు.. ఏకంగా హీరోయిన్స్ ని దాటేసిందిగా…

Karthika Deepam 2: బుల్లితెర పై ‘కార్తీక దీపం’ అనే సీరియల్ సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ ని బుల్లితెర ‘బాహుబలి’ అని పిలుస్తుంటారు. అంటే అంతటి బ్లాక్ బస్టర్ అని దాని అర్థం. ఈ సీరియల్ కి సంబంధించిన రెండవ సీజన్ ‘కార్తీక దీపం 2’ కూడా కొన్నాళ్ల క్రితం మొదలై బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తో స్టార్ మా ఛానల్ లో ముందుకు […]

Karthika Deepam 2: బుల్లితెర పై ‘కార్తీక దీపం’ అనే సీరియల్ సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ ని బుల్లితెర ‘బాహుబలి’ అని పిలుస్తుంటారు. అంటే అంతటి బ్లాక్ బస్టర్ అని దాని అర్థం. ఈ సీరియల్ కి సంబంధించిన రెండవ సీజన్ ‘కార్తీక దీపం 2’ కూడా కొన్నాళ్ల క్రితం మొదలై బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తో స్టార్ మా ఛానల్ లో ముందుకు దూసుకెళ్తోంది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతీ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ లో లేడీ విలన్ గా నటిస్తున్న గాయత్రీ సింహాద్రి కి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.

మొదటి భాగం లో మోనిత అనే విలన్ క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్యారెక్టర్ లో శోభా శెట్టి నటించింది. అప్పటి వరకు ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది కానీ , ఈ సీరియల్ ఆమెకు తెచ్చినంత క్రేజ్ , ఏ సీరియల్ కూడా తీసుకొని రాలేదని చెప్పొచ్చు. అదే తరహాలో రెండవ భాగం లోని జ్యోష్న అనే విలన్ క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అయ్యింది. శాడిజం చూపిస్తే , భయంకరమైన విలనిజం తో , సమాజం లో ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా అని అనిపించేంతలా గాయత్రీ సింహాద్రి ఈ క్యారెక్టర్ లో జీవించింది. ఈమె విజయవాడ కి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి.

చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. చదువు పూర్తి చేసుకొని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె, తన అందంతో మిస్ వైజాగ్ టైటిల్ ని కూడా గతం లో సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభం లో వైజాగ్ లోని కొన్ని న్యూస్ చానెల్స్ లో యాంకర్ గా చేసేది. ఆ తర్వాత ఈటీవీ , జీ తెలుగు, స్టార్ మా చానెల్స్ లో ప్రసారమైన ‘సూపర్ ఫ్యామిలీ’, ‘జోష్’ వంటి టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు ని సంపాదించింది. అంతే కాకుండా ‘మ్యాడ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం కూడా ఈమెకు దక్కింది. అలా హీరోయిన్ అవ్వాలనే కలలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గాయత్రీ చివరికి టీవీ సీరియల్ విలన్ గా స్థిరపడింది. ‘కార్తీక దీపం 2’ కి ముందు ఈమె ‘ముద్ద మందారం’, ‘కల్యాణ వైభోగం’, ‘త్రినయని’ వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ‘కార్తీక దీపం 2’ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్ కి 35 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా నెలకు 15 లక్షల రూపాయిలు సంపాదిస్తుందని సమాచారం. కొంత మంది హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ నెల సంపాదన లేదంటూ సోషల్ మీడియా లో ఒక టాక్ నడుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper