Korean Kanakaraju Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టారు. కొంతమంది యంగ్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు మాత్రమే తెలుగు సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగా ప్రిన్స్ గా పిలవబడే వరుణ్ తేజ్ సైతం గత కొన్ని సంవత్సరాలుగా ప్లాప్ టాక్ ను మూట గట్టుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేసిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాని నిన్న రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి రోజు 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిందంటూ కొన్ని కామెంట్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఈ వీకెండ్ లోనే దాదాపు ఏడు కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో అక్కడ కలెక్షన్స్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ‘డిసి’ సినిమా సైతం మొదటి రోజు కోటి 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిందనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. లోకేష్ కనకరాజు మొదటిసారి హీరోగా చేస్తున్నాడు అంటే ఒక వైవిద్య కథ ఉంటుందని అందరు అనుకున్నారు.
అసలు ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఈ మూవీ సక్సెస్ అవుతుందనే అంచనాలైతే ఎవరికీ లేవు. జస్ట్ మౌత్ టాక్ తోనే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇక ఈ రెండు సినిమాలు కూడా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని సాధిస్తాయి. ప్రేక్షకులందరు ఈ సినిమాల్లో ఏ మూవీని చూడాలనుకుంటున్నారు. ఈ వీక్ లో ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్స్ ను సాధించే అవకాశం ఉందనేది తెలియాల్సి ఉంది…