Homeఎంటర్టైన్మెంట్This Week Movie Releases: ఈ వారం రిలీజైన మూవీస్ లో ఏ మూవీ సక్సెస్...

This Week Movie Releases: ఈ వారం రిలీజైన మూవీస్ లో ఏ మూవీ సక్సెస్ సాధించిందో తెలుసా…

This Week Movie Releases: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. అయితే ఈ వారం కూడా నాలుగు సినిమాలైతే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం… ముందుగా వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నిన్న నైట్ నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. […]

This Week Movie Releases: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. అయితే ఈ వారం కూడా నాలుగు సినిమాలైతే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందుగా వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నిన్న నైట్ నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో డివైడ్ ట్యాగ్ ను మూటగట్టుకుంది. ఈ సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏం లేవని దయ్యం కథతో తెరకెక్కుతుందంటు సినిమాకి ముందుగానే ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ హార్రర్ గొలిపే సన్నివేశాలు ఒకటి కూడా లేకపోవడంతో ఈ సినిమా హార్రర్ జానర్ లోకి రాదని కొంతమంది చెబుతున్నారు. కేవలం సత్యా కామెడీతోనే ఈ సినిమా చాలావరకు ముందుకు నెట్టుకొచ్చింది. ఆయన కనక లేకపోయి ఉంటే ఈ సినిమా అనుకున్న మేరకు ప్రేక్షకుడి నుంచి రెస్పాన్స్ రాబట్టేది కాదు. మొత్తానికైతే ఈ సినిమా ప్రస్తుతం ఆవరేజ్ టాక్ తోనే ఆడుతుంది…

లోకేష్ కనకరాజు హీరోగా తెరకెక్కిన డిసి సినిమా సైతం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో తో పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రేక్షకులందరిని సాటిస్ఫై చేసింది. దాంతో ఈ సినిమాకి హిట్ టాకైతే దక్కింది. ఇప్పుడు ఈ సినిమా షోస్ అన్ని హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి. మొత్తానికైతే లోకేష్ కనక రాజు గత సంవత్సరం కూలీ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఇప్పుడు డిసి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు…

‘కేడి’ ఫేమ్ కిరణ్ డైరెక్షన్ లో KJQ అనే సినిమా తెరకెక్కింది. గత కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్ కిరణ్ అనారోగ్య సమస్యలతో మరణించడంతో KJQ టీమ్ వాళ్లు ఈ సినిమాను దగ్గరుండి మరి బ్యాలెన్స్ వర్క్ అంతా ఫినిష్ చేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది ఫ్రెండ్షిప్ ప్రేమ రివెంజ్ మీద తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాని చూడడానికి కొంతమంది ప్రేక్షకులైతే ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ నిడివితో వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది…ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో. ముందుకు సాగుతుంది…

త్రినాధరావు నక్కిన ప్రొడ్యూసర్ గా మారి తెరకెక్కిన సినిమా ‘అనకాపల్లి’ ఈ సినిమా చిన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రా సీన్స్ తో కూడుకున్న ఈ సినిమా బి లో అవేరేజ్ టాక్ తో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది…

ఓవరాల్ గా ఈ వారం ‘డిసి’ సినిమా సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. లోకేష్ కనకరాజు మొదటిసారి హీరోగా నటించాడు. అలాగే మొదటి స్టెప్ తోనే సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper