Homeఎంటర్టైన్మెంట్Kooku With Jathi Ratnalu 2: రేపటి ఎపిసోడ్ తో ముగియనున్న 'కుకూ విత్ జాతి...

Kooku With Jathi Ratnalu 2: రేపటి ఎపిసోడ్ తో ముగియనున్న ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’.. చరిత్ర తిరగరాసిన తనూజ..

Kooku With Jathi Ratnalu 2: స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగిన ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో రేపటి ఎపిసోడ్ తో ముగియనుంది. ఈమధ్య కాలం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఎంటర్టైన్మెంట్ షోస్ లలో, ది బెస్ట్ షో ఇదేనని చెప్పొచ్చు. నోరు ఊరించే వంటకాలతో ప్రేక్షకులను టెంప్ట్ చేయించడమే కాకుండా, అద్భుతమైన కామెడీ తో కడుపుబ్బా నవ్వులు పూయించింది ఈ కుకింగ్ […]

Kooku With Jathi Ratnalu 2: స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగిన ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో రేపటి ఎపిసోడ్ తో ముగియనుంది. ఈమధ్య కాలం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఎంటర్టైన్మెంట్ షోస్ లలో, ది బెస్ట్ షో ఇదేనని చెప్పొచ్చు. నోరు ఊరించే వంటకాలతో ప్రేక్షకులను టెంప్ట్ చేయించడమే కాకుండా, అద్భుతమైన కామెడీ తో కడుపుబ్బా నవ్వులు పూయించింది ఈ కుకింగ్ షో. మొదటి సీజన్ కేవలం 20 ఎపిసోడ్స్ మాత్రమే. కానీ రెండవ సీజన్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుండడం తో దాదాపుగా 40 ఎపిసోడ్స్ చేశారు. ప్రతీ ఎపిసోడ్ కి అటు హాట్ స్టార్ లో , ఇటు స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయట.

ఇక నేడు సెమి ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో పల్లవి గౌడ అందరికంటే తక్కువ మార్కులు సంపాదించుకొని టాప్ 6వ స్థానం లో ఎలిమినేట్ అయ్యింది. ఈ షో లో మొదటి నుండి మంచి మార్కులు తెచ్చుకుంటూ వస్తున్న కంటెస్టెంట్ ఈమె. అలాంటి కంటెస్టెంట్ చివరికి ఈ స్థానం లో ఎలిమినేట్ అవ్వడం ఆమె అభిమానులకు బాధని కలిగిస్తోంది. అయితే గత సీజన్ లో ఇదే 6వ స్థానం లో తనూజ ఎలిమినేట్ అయ్యింది. కానీ సీజన్ 2 లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె టైటిల్ విన్నర్ గా నిలిచి చరిత్ర తిరగరాసింది. ఆమె అభిమానులకు ఇది గూస్ బంప్స్ మూమెంట్స్ అనే చెప్పాలి. ఇక ఈ సీజన్ రన్నర్ గా డిమోన్ పవన్ నిలిచాడు. వాస్తవానికి ఆయనకు ఇది మంచి కం బ్యాక్ అనే చెప్పాలి. మొదటి ఎపిసోడ్ నుండి అద్భుతమైన వంటకాలు చేస్తూ , టాప్ 1 స్థానం లో నిలుస్తూ వచ్చాడు డిమోన్ పవన్.

కానీ ఈమధ్య కాలం లో బాగా డౌన్ అయ్యాడు. అలాంటి పవన్ ఇప్పుడు రన్నర్ గా నిలవడం ఆయన అభిమానులు సంతృప్తి ని ఇచ్చింది. అదే విధంగా టాప్ 3 స్థానం లో నిఖిల్ విజయేంద్ర సింహా నిలవగా, టాప్ 4 స్థానం లో ఆషికా నిల్చింది. ఇక చివరికి టాప్ 5 స్థానం లో మిగిలిన కంటెస్టెంట్ రాకేష్. వాస్తవంగా ఈయన కచ్చితంగా టాప్ 3 లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఈమధ్య కాలం లో బాగా డౌన్ అయ్యాడు, ఫినాలే ఎపిసోడ్ లో కూడా కం బ్యాక్ ఇవ్వలేకపోయాడు. ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ కి కుకింగ్ పోటీలు రేపటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper