NTR Health Update: డ్రాగన్’ మూవీ షూటింగ్ సమయం లో భుజాలకు తీవ్రమైన గాయాలైన ఎన్టీఆర్ , గత కొంతకాలం నుండి షూటింగ్ కి విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ , డ్రాగన్ మూవీ షూటింగ్ విరామం లేకుండా సాగుతూనే ఉంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?, ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నాడా లేదా?,అంటూ ఎన్టీఆర్ లేటెస్ట్ హెల్త్ బులిటెన్ కోసం అభిమానులు కొన్ని రోజులు నుండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరపడింది. నేడు ఎన్టీఆర్ కి సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో సర్జరీ ని పూర్తి చేసినట్టు సమాచారం.
డాక్టర్ పూర్ణచంద్ర నేతృత్వం లో నలుగురితో కూడిన వైద్యుల బృందం ఎన్టీఆర్ కి సర్జరీ చేశారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కొన్ని రోజుల పాటు ఆయన హాస్పిటల్ లోనే ఉండాలట. అయితే ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని , మళ్లీ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే కచ్చితంగా 2 నుండి 3 నెలల సమయం పడుతుందని అంటున్నారు. అంటే అప్పటి వరకు ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు లేవా?, ఒకవేళ ఆయన కాస్త కంఫర్ట్ ఫీల్ అయినా షూటింగ్ లోకి వచేస్తాడా?, రెండు నుండి 3 నెలల సమయం అంటే , కచ్చితంగా సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే కనుక జరిగితే జూన్ 11,2027 లాంటి అద్భుతమైన డేట్ మిస్ అవుతుంది.
మరి మేకర్స్ ఏమి చేయబోతున్నారో చూడాలి. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్’ గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. గ్లింప్స్ లోని ప్రతీ ఫ్రేమ్ లో ప్రశాంత్ నీల్ మార్క్ కనిపించింది. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఈ సినిమా ద్వారా చూడొచ్చు అనే భావనను అందరిలోనూ కలిగింది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఒక పాత్ర పేరు డ్రాగన్ కాగా , మరో పాత్ర పేరు లూగర్ . ఈ చిత్రం లో హీరో ఆయనే , విలన్ కూడా ఆయనే. ఈ రెండు పాత్రల్లో ఎన్టీఆర్ ఏ రేంజ్ విద్వంసం నెలకొల్పబోతున్నాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.