Jabardasth Varsha : ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు వర్ష. ఈమె ఇప్పటికీ జబర్దస్త్ తో పాటు , ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో లోనూ కనిపిస్తూ ఉంటుంది. చూసేందుకు హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదు అనే రేంజ్ లో ఉంటుంది. అయినప్పటికీ ఈమె కమెడియన్ గా , యాంకర్ గా స్థిరపడిపోవడం ఏంటో అని ఆమె అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా ఈటీవీ లో ఈమె ఇమ్మానుయేల్ తో జోడీ కట్టి , అతనికెతో కలిసి చేసే కామెడీ స్కిట్స్ కి ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. సుధీర్ – రష్మీ జంట ఆన్ స్క్రీన్ లో ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో , వర్ష – ఇమ్మానుయేల్ జంట కూడా అదే రేంజ్ లో పాపులర్ అయ్యింది.
ఇకపోతే రీసెంట్ గానే యూట్యూబ్ లో ‘కిస్సిక్ టాక్స్’ అనే టాక్ షో ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో ఎదురైనా కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయిపోయింది వర్ష. ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ సినిమాలతోనే మొదలైంది. ఆ తర్వాత నేను కొన్ని సీరియల్స్ లో కూడా చేసాను. అలా వచ్చిన ఫేమ్ తో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి బాగా ఫేమస్ అయ్యాను. మొదట్లో నేను సినీ రంగం లోకి రావడానికి నా కుటుంబ సభ్యులు అసలు ఒప్పుకోలేదు. నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు నా అక్కా చెల్లెళ్లు నాతో మాట్లాడడం పూర్తిగా మానేశారు. నువ్వు మా చెల్లవని ఎక్కడ చెప్పొద్దూ అనేవారు. దీని వల్ల నేను చాలా మనస్తాపానికి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది వర్ష.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ వాళ్లకు మొదటి నుండి ఈ రంగం అంటే ఇష్టం ఉండేది కాదు. మీ చెల్లి ఏంటి ఇలా చేస్తుంది అని వాళ్ళ చుట్టుపక్కల ఉండేవారు అనడంతో వారు చాలా ఇబ్బంది పడి నాతో అలా కటువుగా వ్యవహరించారు. అయితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి , హైపర్ ఆది టీం లో స్కిట్స్ చేసిన తర్వాత నాకు చాలా మంచి పేరొచ్చింది. మీ చెల్లి జబర్దస్త్ లో కనిపించింది , హైపర్ ఆది స్కిట్స్ లో అదరగొట్టేస్తుందని ప్రజలు చెప్పడం తో మళ్లీ నా అక్కా చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు మాట్లాడడం మొదలు పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది వర్ష. ఇకపోతే ఈమె ‘బిగ్ బాస్ 10’ లోకి ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.