Jabardasth Faima : ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు ఫైమా. ఈమె కామెడీ టైమింగ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాదు , ఈటీవీ లో ప్రతీ బుధ, గురువారాల్లో ప్రసారమయ్యే ‘ఢీ 20 ‘ షోలో కూడా ఆమె ఒక మెంటర్ గా వ్యవహరిస్తోంది. వీటితో పాటు ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో , పండగ ఈవెంట్స్ లలో తరుచు కనిపిస్తూ ఉంటుంది ఫైమా. అంతకు ముందు ఈమె ‘బిగ్ బాస్ 6’ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది. ప్రేక్షకులకు ఈ షో ద్వారా ఈమె ఇంకా బాగా దగ్గరైంది. ఈ షో పూర్తి అయిన వెంటనే ఆమె అనేక స్టార్ మా ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొన్నది.
‘బీబీ జోడీ 1’ షోలో ఈమె టైటిల్ విన్నర్ గా కూడా నిల్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అదే ఛానల్ లో అప్పుడప్పుడు ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే టాప్ కామెడీ షోలో పాల్గొనేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , స్టార్ మా ఛానల్ కి గుడ్ బై చెప్పి , మళ్లీ ‘జబర్దస్త్’ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ప్రవీణ్ నాయక్ అనే అతన్ని పెళ్లాడింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే ఫైమా , తన రోజువారీ దినచర్య ని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అలా ఆమె తన పెళ్ళికి నాగబాబు ఇచ్చిన బహుమతి గురించి చెప్తూ ఎంతగానో మురిసిపోయింది.
ఆమె మాట్లాడుతూ ‘నా పెళ్ళికి నాగబాబు రాలేదు కానీ , ఈరోజు షూటింగ్ కి వెళ్ళినప్పుడు నాకు ఈ డబ్బులు బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సార్ నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్ల , నేను ఇంకా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది ఫైమా. ఈమెకు డబ్బులు కొత్తేమి కాదు , కానీ నాగబాబు ప్రేమతో గుర్తు పెట్టుకొని మరీ ఈమెకు ఈ డబ్బులు బహుమతిగా ఇవ్వడం అనేది , నిజంగా వెలకట్టలేని బహుమతే అని చెప్పొచ్చు. ఈమధ్యనే నాగబాబు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఈ షో కి వచ్చినప్పటి నుండి టీఆర్ఫీ రేటింగ్స్ మెరుగుపడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
