Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : అనసూయ ఎవరో నాకు తెలియదంటూ యంగ్ యాంకర్ హాట్ కామెంట్స్..

Anasuya Bharadwaj : అనసూయ ఎవరో నాకు తెలియదంటూ యంగ్ యాంకర్ హాట్ కామెంట్స్..

Anasuya Bharadwaj : బుల్లితెర ద్వారా పాపులారిటీ ని సంపాదించి , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన యాంకర్ అనసూయ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న చిన్న షోస్ ద్వారా యాంకరింగ్ చేసుకుంటూ , ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె , ఆ షో ద్వారా సాధించిన ఫేమ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 10 ఏళ్ళ పాటు ఆమె ఆ […]

Anasuya Bharadwaj : బుల్లితెర ద్వారా పాపులారిటీ ని సంపాదించి , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన యాంకర్ అనసూయ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న చిన్న షోస్ ద్వారా యాంకరింగ్ చేసుకుంటూ , ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె , ఆ షో ద్వారా సాధించిన ఫేమ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 10 ఏళ్ళ పాటు ఆమె ఆ షోలో కొనసాగింది. సోషల్ మీడియా లో కూడా యాంకర్ అనసూయ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత రీచ్ ఆమెకు ఉంది. అలాంటి రీచ్ ఉన్న స్టార్ యాంకర్ ఎవరో నాకు తెలియదు అంటూ , ఒక యూన్ యాంకర్ కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మరెవరో కాదు సౌమ్య రావు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈమె, మన తెలుగు లోకి జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కి తనదైన స్టైల్ లో ఆమె చేసిన యాంకరింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ షో తర్వాత ఆమె అనేక షోస్ కి యాంకర్ గా చేసింది , పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొనింది . అంతే కాకుండా పలు టీవీ సీరియల్స్ లో విలన్ గా కూడా నటించి మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అయితే ఈమె గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అనసూయ గురించి చేసిన కామెంట్స్, ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యాయి. ముందుగా ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు జబర్దస్త్ లోకి యాంకర్ అనసూయ స్థానం లోకి వచ్చారు కదా , ఆమె నుండి ఏమైనా సలహాలు తీసుకున్నారా ‘ అని అడుగుతుంది.

అందుకు సౌమ్య రావు సమాధానం చెప్తూ ‘ఈ షో ఒప్పుకున్నప్పుడు అనసూయ వి కొన్ని వీడియోస్ చూశాను . ఆమె యాంకరింగ్ స్టైల్ అర్థం అయ్యింది. కానీ నేను ఆమెని ఎప్పుడూ అనుకరించలేదు. నా స్టైల్ లోనే యాంకరింగ్ చేశాను ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఈ షో కి యాంకర్ గా వ్యవహరించే అవకాశం మీకు అనసూయ నే ఇప్పించింది అంటున్నారు , ఇందులో ఎంత వరకు నిజముంది అని అడగ్గా, దానికి సౌమ్య సమాధానం చెప్తూ ‘జబర్దస్త్ కి ముందు అనసూయ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెని పలు ఈవెంట్స్ లో కలిసాను. చాలా మంచి వ్యక్తి , ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇచ్చేది’ అంటూ చెప్పుకొచ్చింది సౌమ్య.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper