Bigg Boss Telugu 10: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభం అవ్వడానికి పట్టుమని నెల రోజులు కూడా లేదు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ‘జబర్దస్త్’ నుండి కంటెస్టెంట్స్ గా కొంతమంది కమెడియన్స్ రాబోతున్నారు. అయితే గతం లో కేవలం ఒకరు , లేదంటే ఇద్దరు వచ్చే వారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నలుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వాళ్లెవరో ఒకసారి వివరంగా చూద్దాం.
ఆటో రామ్ ప్రసాద్ :
పరిచయం అక్కర్లేని పేరు ఇది. సుడిగాలి సుధీర్ టీంలో ఈయన వేసే ఆటో పంచులు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆ టీం కి అంత గొప్ప పేరు రావడానికి గల కారణం ఈయనే. ఎందుకంటే ప్రతీ స్కిట్ ని ఆయనే రాస్తుంటాడు. జబర్దస్త్ తర్వాత ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించాడు , పలు సినిమాల్లో కూడా నటించాడు. ఈయనకు బిగ్ బాస్ టీం వారానికి 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు టాక్.
నూకరాజు :
ఈయన కూడా పాపులర్ జబర్దస్త్ కమెడియన్. ఆ తర్వాత ఈటీవీ లో ఎన్నో సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించాడు. సోషల్ మీడియా లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘, ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ వంటి షోస్ లో కూడా పాల్గొన్నాడు. ఈయనకు వారానికి 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకున్నారట:
వర్ష / రాకింగ్ రాకేష్ :
ఈ ఇద్దరి జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరు బిగ్ బాస్ 10 లోకి వచ్చే అవకాశం ఉందట. వర్ష జబర్దస్త్ కమెడియన్ గా బాగా పాపులర్ , అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించిన ఈమె , రీసెంట్ గా యూట్యూబ్ లో ‘కిసిక్ టాక్స్’ అనే షో తో ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరైంది. అంతే కాకుండా ఈమె ఈటీవీ లో ఇమ్మానుయేల్ కి జోడిగా మంచి క్రేజ్ ని సంపాదించింది. ఈమెని రీసెంట్ గానే బిగ్ బాస్ టీం సంప్రదించారట , వారానికి 1 లక్షా 50 వేల రెమ్యూనరేషన్ ఆఫర్ కూడా ఇచ్చారట. మరి ఈమె వస్తుందో లేదో చూడాలి.
ఇక జబర్దస్త్ ద్వారా పాపులారిటీ ని సంపాదించినా మరో కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్. ఈయనకి కూడా మంచి పాపులారిటీ ఉంది. జోర్దార్ సుజాత ఈయన సతీమణి అనే సంగతి అందరికీ తెలిసిందే. గతం లో ఈమె కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నది. రీసెంట్ గానే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో ఒక కుక్ గా పాల్గొని అద్భుతమైన వంటకాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ని అందించిన రాకేష్ ని బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఈయనకు వారానికి 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. మరి ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడో లేదో చూడాలి.
పొట్టి నరేష్ :
‘జబర్దస్త్’ ద్వారా బాగా పాపులర్ అయినా ఈ కమెడియన్ ని , గత రెండు మూడు సీజన్స్ నుండి అడుగుతూనే ఉన్నారట బిగ్ బాస్ టీం. కానీ ఎదో ఒక కారణం చేత ఈయన బిగ్ బాస్ ఎంట్రీ కుదర్లేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆయన కంటెస్టెంట్ గా అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈయనకు కూడా వారానికి 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసినట్టు టాక్.