విజయ్ దేవరకొండ ,పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఫైటర్’ అనుకోని ఇబ్బందుల్లో పడింది . ముంబై లోని `ధారావి` ప్రాంతం లో జరిగే కథ గా రూపొందుతున్న ఈ చిత్రం కరోనా మహమ్మారి మూలంగా అప్సెట్ అయ్యేలా వుంది . విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి పూరీ జగన్నాధ్ సిద్ధం అవడం వలన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించడం జరుగుతోంది. అందువలన `ధారావి` ప్రాంతంలో జరపాలనుకొన్న షూటింగ్ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వక తప్పేలా లేదు. దాంతో నిర్మాతగా పూరీ జగన్నాధ్ కొంత రిస్క్ తీసుకొంటున్నాడు. బడ్జట్ పెరిగినా తప్పదు అనుకోని షూటింగ్ ఇక్కడే చేయబోతున్నాడు. ముంబై లోని `ధారావి` ని హైదరాబాద్ లో సృష్టించాలని అనుకొంటున్నాడు. .
ఆ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియో లో `ధారావి` సెట్స్ వేసి షూటింగ్ ముగించేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి పూరి జగన్నాధ్ వచ్చాడని తెలుస్తోంది. సాధారణంగా పూరి జగన్నాధ్ తన సినిమాలకి సెట్స్ వేయడు, వేయఁచడానికి ఇష్టపడడు. అలాంటిది ఫస్ట్ టైం తప్పనిసరి పరిస్థితి లో సెట్స్ వేయడానికి రెడీ అవుతున్నాడు . కాగా ఈ పాన్ ఇండియా సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమవుతోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Fighter movie shooting in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com