Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh : పూరి జగన్నాధ్ కి డేట్స్ ఇచ్చిన మరో స్టార్ హీరో... పోకిరి...

Puri Jagannadh : పూరి జగన్నాధ్ కి డేట్స్ ఇచ్చిన మరో స్టార్ హీరో… పోకిరి రేంజ్ కథతో వస్తున్నాడా..?

Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జజగన్నాధ్ ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉండేవి. ఆ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో తన ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో […]

Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జజగన్నాధ్ ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉండేవి. ఆ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో తన ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు ప్రేక్షకులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన నాసిరకం కథలతో సినిమాలను చేస్తున్నాడు. గొప్ప కథలు రాయగలిగే కెపాసిటీ పూరి దగ్గర ఉన్నప్పటికి ఆయన ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ లో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మాఫియా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని అదే మూస పద్ధతిలో సినిమాలను చేస్తుండటం ప్రతి ఒక్కరి నిరాశకి గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పూరి జగన్నాధ్ తన పంథాను మార్చుకొని మంచి సినిమాను చేయగలిగితే తనకు ఎదురు ఎవరు ఉండరు అనేది వాస్తవం… అలాంటి పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా వీలైనంత తొందరగా రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఈ మూవీ తర్వాత అతను ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో కూడా చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ హీరోతో పూరి జగన్నాధ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివ కార్తికేయన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పూరి కథ చర్చలను కూడా జరుపుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. స్లామ్ డాగ్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శివ కార్తికేయన్ సినిమా చేయాలని చూస్తున్నాడట. వీలైనంత తొందరగా ఓపెనింగ్ కార్యక్రమాలు చేపట్టాలనే ప్రయత్నంలో పూరి జగన్నాధ్ ఉన్నారట.

ఈ సినిమా బడ్జెట్ ఎంత సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుంది అనే విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా శివ కార్తికేయన్ స్టోరీస్ సెలక్షన్ బాగుంటుంది. పూరి తనకు ఏ స్టోరీ చెప్పి ఒప్పించాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే శివ కార్తికేయన్ పూరి జగన్నాథ్ చెప్పిన రొటీన్ రొట్టా కథలకు ఎలా ఫ్లాట్ అయ్యాడు. లేదంటే పూరి అతని కోసం పోకిరి రేంజ్ లో ఏదైనా ఒక కొత్త కథను రెడీ చేశాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper