Korean Kanakaraju: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడంలేదు. దాంతో ఆయన చాలావరకు డిసప్పాయింట్ అవుతున్నాడు. కొరియన్ కనకరాజు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదనే చెప్పాలి.
ముఖ్యంగా ఈ సినిమాలో హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సినిమాను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాలో ఒక హార్రర్ ఎలిమెంట్ కూడా లేదు. నిజానికి ఒక కొరియన్ వ్యక్తి ఆత్మ ఇండియన్ బాడీలోకి రావడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికి దాన్ని ఫుల్ ఫ్లెడెడ్జ్ గా స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయలేకపోయారు…
హీరో బాగా కష్టపడ్డప్పటికి దర్శకుడు సినిమాని అనుకున్న రేంజ్ లో స్క్రీన్ మీదకి తీసుకురావడంలో ఫెయిలయ్యాడు. ఇక ఈ సినిమాలో సత్య కామెడీ ఒకటే ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ అయితే సినిమాలో చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ చాలా వరస్ట్ గా ఉంది. సినిమా లెంత్ కూడా చాలా ఎక్కువైంది.
ఎడిటర్ తన ఎడిట్ వర్క్ కూడా ఇంకాస్త షార్ప్ చేసి ఉంటే బాగుండేది… మొత్తానికైతే సినిమాలో ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువగా ఉన్నాయి…ఇక వరుణ్ తేజ్ తో పాటు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు పాన్ ఇండియా హీరోలుగా ముందుకు సాగుతుంటే ఆయన మాత్రం ఇంకా ఒక సక్సెస్ ను సాధించడానికి నానాతంటాలు పడుతున్నాడు… తొందర్లోనే ఆయన పెర్ఫెక్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించాల్సిన అవసరమైతే ఉంది లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదమైతే ఉంది…