
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత కొరటాల దర్శకత్వంలో తండ్రి చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం యూక షూటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది .ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ పాత్ర ఉద్వేగ పూరితంగా ఆచార్య సినిమాని మలుపు తిప్పేదిగా ఉంటుందని అంటున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగే ఈ పాత్రకు ప్రేయసి మరియు చెల్లెలు కూడా ఉంటారట . ప్రేయసి పాత్రకు రష్మిక మందన్నఎంపిక కాగా .. చెల్లెలి పాత్రలో నీహారిక కొణెదల కనిపించ బోతోంది .
రామ్ చరణ్ కి, ఆయన నీహారిక ( చెల్లెలి పాత్ర ) మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. బలమైన సిస్టర్ సెంటిమెంట్ వున్న కారణంగానే చెల్లెలయ్యె నీహారిక అయితే బాగుంటుందని ఆమెను ఆ పాత్రకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు నీహారిక ‘సైరా’లో పెదనాన్న తో కలిసి నటించింది . ఇక ‘ఆచార్య’లో అన్నయ్య తో కలిసి నటించ బోతోంది .