Express Hari: తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించే కమెడియన్స్ లో ఒకరు ఎక్స్ ప్రెస్ హరి. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఈయన , ఆ తర్వాత స్టార్ మా ఛానల్ లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఇంకా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇతను కేవలం కమెడియన్ మాత్రమే కాదు, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో కి డైలాగ్స్ ని రాస్తుంటాడు. కేవలం ఈ కారణం వల్లే , ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే హరి లేకపోతే సగం మా టీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ కి స్క్రిప్ట్ ఉండదు కాబట్టి. అయితే నేడు జరిగిన ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఇచ్చాడు.
త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నానని , దీపికా రంగరాజు తో గత కొంతకాలం గా ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీపికా ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే పాపులర్ సూపర్ హిట్ సీరియల్ ‘బ్రహ్మముడి’ లో హీరోయిన్. ఈ సీరియల్ తో ఆమె కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొని ఈమె పండించే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజ్ , పాపులారిటీ ఉన్న హీరోయిన్ ని హరి పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సంఘటనలు చూసి , వీళ్లిప్పుడు ఇంత దగ్గరయ్యారు అంటూ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే ఇదంతా కేవలం స్కిట్ లో భాగంగా చేసిందా?, లేదా నిజంగానే వీళ్లిద్దరు ప్రేమికులా ? అనేది తెలియాల్సి ఉంది. 200 వ ఎపిసోడ్ సందర్భంగా , చాలా గ్రాండ్ గా దీపికా ని పల్లకి లో మోసుకొచ్చారు. చాలా సేపు సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ రివీల్ చేశారు. ఇంత చేశారంటే కచ్చితంగా నిజమే అయ్యుంటుంది అంటూ సోషల్ మీడియా లో మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ క్రేజీ ఎపిసోడ్ ని చూడని వాళ్ళు చూడాలనుకుంటే , వెంటనే హాట్ స్టార్ ఓపెన్ చేసి చూసేయండి.
View this post on Instagram