Homeఎంటర్టైన్మెంట్Express Hari: 'ఎక్స్ ప్రెస్ హరి' సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఇలాంటి పనులు చేసేవాడా?...

Express Hari: ‘ఎక్స్ ప్రెస్ హరి’ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఇలాంటి పనులు చేసేవాడా? అసలు ఊహించలేదు!

Express Hari: బుల్లితెర ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే కమెడియన్స్ లో ఒకరు ఎక్స్ ప్రెస్ హరి. ఇతను అసలు పేరు హరి పోతుపురెడ్డి. స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం హరి లేకపోతే ఎంటర్టైన్మెంట్ షోస్ ని నడపడం కష్టం. ఎందుకంటే దాదాపుగా ప్రతీ షో కి స్క్రిప్ట్ , డైలాగ్స్ రాసేది ఆయనే కాబట్టి. కెమెరా ముందు లేకపోయినా , కెమెరా వెనుక హరి ఉండాల్సిందే. స్టార్ మా ఛానల్ లో […]

Express Hari: బుల్లితెర ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే కమెడియన్స్ లో ఒకరు ఎక్స్ ప్రెస్ హరి. ఇతను అసలు పేరు హరి పోతుపురెడ్డి. స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం హరి లేకపోతే ఎంటర్టైన్మెంట్ షోస్ ని నడపడం కష్టం. ఎందుకంటే దాదాపుగా ప్రతీ షో కి స్క్రిప్ట్ , డైలాగ్స్ రాసేది ఆయనే కాబట్టి. కెమెరా ముందు లేకపోయినా , కెమెరా వెనుక హరి ఉండాల్సిందే. స్టార్ మా ఛానల్ లో అత్యంత విలువైన టాలెంట్ అవ్వడం వల్లనే హరి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోకి అడుగుపెట్టలేకపోతున్నాడు. ఆయన లేకపోతే షోస్ నడవడం కష్టం కాబట్టే , ఇలా చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇంతటి టాలెంట్ ఉన్న హరి అసలు ఇండస్ట్రీ కి ఎలా పరిచయం అయ్యాడు , ఇండస్ట్రీ లోకి రాకముందు ఏమి చేసేవాడు వంటివి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే హరి 1991 వ సంవత్సరం , విజయనగరం లో జన్మించాడు. ఇతని తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఒక సాధారణ గృహిణి. చదువు పూర్తి అయ్యాక బ్యాంకింగ్ రంగం లో ఉద్యోగం సంపాదించడానికి హరి చాలానే కష్టపడ్డాడు. కానీ ఎందుకో కుదర్లేదు. మొదటి నుండి సినిమాలపై హరి కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎంత ప్రయత్నం చేసిన బ్యాంక్ ఉద్యోగం రాకపోవడం తో , తనకు ఇష్టమైన సినీ రంగం లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన హైదరాబాద్ కి వచ్చి ఒక్క అవకాశం కోసం చాలానే కష్టపడాల్సి వచ్చింది. అలా ఈటీవీ లో అత్యంత ఆదరణ పొందిన ‘పటాస్’ షో ద్వారా మంచి గుర్తింపు ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో బాగా పాపులర్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత అనేక ఓటీటీ షోస్ లో చేసాడు, స్టార్ మా ఛానల్ లో ‘కామెడీ స్టార్స్’ ద్వారా మరింత పాపులారిటీ ని సంపాదించాడు. రీసెంట్ గానే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో ఎంత కామెడీ ని పండించాడో మనమంతా చూశాము . తన తోటి కంటెస్టెంట్స్ తో పాటు , జడ్జీలకు, యాంకర్ ప్రదీప్ కి కూడా ఆ షో లో డైలాగ్స్ రాసింది హరి నే. ప్రస్తుతం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో లో పాల్గొంటున్నాడు హరి. రీసెంట్ గానే 200 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు స్టార్ మా ఛానల్ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు వెళ్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper