బాలీవుడ్ సినియర్ నటీమణులకే ఆమె సీనియర్ నటి. నటిగా ఆమె ఒక సంచలనం. ఆమె ‘నీనా గుప్తా’. ఈ పేరు వినగానే బోల్డ్ నెస్ కూడా సిగ్గు పడుతుంది. యంగ్ బ్యూటీలు ఎక్స్ పోజింగ్ చేయడం సాధారణం, కానీ, అమ్మమ్మ వయసులో కూడా ఎక్స్ పోజింగ్ చేయడంలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవడం అంటే.. బహుశా అది ఒక్క నీనా గుప్తాకే సాధ్యం అయింది అనుకుంటా.
ఇక తాజాగా నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ అనే పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బుక్ సినీ అభిమానులతో పాటు సామాన్యులను కూడా బాగా అలరిస్తోంది. తన జీవిత విశేషాలను ఈ బుక్ లో క్లారిటీగా వెల్లడించింది నీనా గుప్తా. మరి ఆమె మాటల్లోనే కొన్ని ముచ్చట్లను విందాం. ‘నా మొదటి భర్త పేరు అమ్లాన్ కుమార్ ఘోస్. మా కుటుంబాలకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాము’ అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
నీనా గుప్తా పెళ్లి చేసుకుంది ఎప్పుడో తెలుసా ఏభై ఏళ్ల క్రితం. అప్పుడే ప్రేమ వివాహం చేసుకుంది. కాకపోతే ఆ తర్వాత నీనా మనసు నాటకాల వైపు మళ్ళింది. కానీ ఆమె భర్తకు మాత్రం ఇంటి పట్టునే ఉండే భార్య కావాలి కోరుకున్నాడు. కానీ, నీనాకి బయట తిరగడం ఇష్టం. అందుకే భర్తకు ఇష్టం లేకపోయినా నాటకాలు అంటూ తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు.. పెళ్లైన ఏడాదిలోపే విడిపోయారు.
అయితే తన మొదటి భర్త గురించి చెబుతూ… ‘నాకు అమ్లాన్ అంటే ఇప్పటికీ ఇష్టమే. నిజానికి మేము విడిపోయే సమయంలో కూడా ఎప్పుడు పెద్దగా గొడవ పడలేదు. కాకాపోతే, ఒకరి పై ఒకరికి కోపం ఉండేది. కానీ, ఎప్పుడు ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోలేదు. విడిపోయే సమయంలో కూడా స్నేహంగానే ఉన్నాము. తను గుడ్ పర్సన్ ’ అంటూ సిగ్గు పడుతూ చెప్పింది నీనా గుప్తా.