spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroes: మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో తెలుసా?

Tollywood Heroes: మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో తెలుసా?

Tollywood Heroes: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ లలా నిలుస్తున్న ప్రతి ఒక్క నటీనటులు ఒకప్పుడు ట్రైనింగ్ అయినవాళ్లే.. ఏ రంగంలో అయినా ట్రైన్ అవుతూనే ఉంటారు. విలువిద్యలు నేర్చుకోవాలంటే ఆశ్రమాలకు వెళ్లేవారు శిశ్యులు. కానీ ఇప్పుడు ట్రైయినింగ్ ఇన్ స్టిట్యూట్ లు వచ్చాయి. బిజినెస్ కోర్సులు, ఆన్ లైన్ తరగతులు, ఉద్యోగం కోసం ఇన్ స్టిట్యూట్ లు, నటన కోసం యాక్టింగ్ స్టూడియోలు కూడా కోకొల్లాలుగా ఉన్నాయి. అది ఇప్పటి మాట కాదు. ఎప్పటి నుంచో సాగుతున్న తతంగం. అయితే హీరో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు కూడా ట్రైన్ అయి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళు ముగ్గురు ఎంత పెద్ద హీరోలో మనందరికి తెలిసిందే. తెలుగు లో ఉన్న అతి కొద్దీ మంది పెద్ద హీరోల్లో వీళ్ళు ముగ్గురికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి…అయితే ఈ ముగ్గురికి యాక్టింగ్ లో మెళుకువలు నేర్పిన వ్యక్తి ఒక్కరే అని చాలా మంది కి తెలీదు ఆయనెవరో ఒకసారి తెలుసుకుందాం.

అయితే మొదటగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని సినిమాల్లోకి తీసుకురావాలి అని ఎంత ట్రై చేసిన పవన్ కళ్యాణ్ కి మాత్రం సినిమాలోకి రావడం అసలు నచ్చేది కాదట. ఆయన ఒక్కడే ఎవరితో సంబంధం లేకుండా ఒంటరి గా కూర్చొని బుక్స్ చదువుతూ ఉండేవాడట. ఒకానొక సందర్భంలో సన్యాసం తీసుకుందాం అని హిమాలయాలకు పోవాలి అని డిసైడ్ అయ్యాడట పవన్. ఒకసారి హిమాలయాలకు పోయే ప్రయత్నం కూడా చేసాడట ఈ స్టార్ హీరో. కానీ వాళ్ళ వదిన సురేఖ గారి మాట మీద గౌరవం తో ఆగిపోయాడని టాక్ వచ్చింది. అయితే ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇలా వదిలి పెడితే కుదరదు అని తెలిసి పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేకపోయినా సినిమాలోకి తీసుకువచ్చాడట.

అయితే అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్ లో మెళుకువలు నేర్పడానికి వైజాగ్ సత్యానంద్ దగ్గరికి పంపించాడట. అలా ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే మంచి నటుడిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్ హీరో అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ ని చూసిన కృష్ణ గారు మహేష్ బాబు ని కూడా సత్యానంద్ దగ్గరికి పంపించి యాక్టింగ్ నేర్పించాడు. ఇక వీళ్లిద్దరు సక్సెస్ అవ్వడం తో ప్రభాస్ కూడా ఆయన దగ్గరే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడని తెలుస్తోంది.

ఇలా వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న ముగ్గురు హీరోలు కూడా టాప్ పొజిషన్ లో ఉండడం చేస్తుంటే.. ఆయన యాక్టింగ్ క్లాస్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పవచ్చు. యాక్టింగ్ నేర్చుకొని వదిలేయడమే కాకుండా తను యాక్టింగ్ నేర్పడం వల్లే ఈ రోజు తాను టాప్ పొజిషన్ లో ఉన్నాను అనే ఒకే ఒక ఉదేశ్యం తో పవన్ కళ్యాణ్ సత్యానంద్ వాళ్ళ కూతురు పెళ్లికి 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేసాడు. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు అనే చెప్పాలి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper