Jana Nayagan budget recovery: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం ఎట్టకేలకు ఉన్న సమస్యలను క్లియర్ చేసుకుంది, ఇక విడుదల తేదీని ప్రకటించడం ఒక్కటే బ్యాలన్స్ అని అంతా అనుకున్నారు. ఫిబ్రవరి 20 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదల అవ్వడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ , ఓటీటీ రైట్స్ కి కొత్త స్లాట్స్ కోసం వెతుక్కోవాలి. ప్రస్తుతం ఆ చర్చల్లోనే ఉన్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఒకసారి వాయిదా పడడంతో ముందు అనుకున్న రేట్స్ కి 50 శాతం తగ్గించి ఇవ్వాలని ఓటీటీ సంస్థ డిమాండ్ చేస్తుందట. నిర్మాత అందుకు సిద్ధం గా లేడు. 20 శాతం తగ్గించడానికి రెడీ గా ఉన్నాడు.
కానీ నిర్మాత అడిగినంత డబ్బులు ఇవ్వాలంటే, ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై, సూపర్ హిట్ గా నిల్చి 400 కోట్ల గ్రాస్ మార్కుని దాటితే ఆలోచిస్తాం అని ఓటీటీ సంస్థ అంటుందట. నిర్మాతలకు ఇప్పుడు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ని అమ్మడం మాత్రమే కాదు, థియేట్రికల్ రైట్స్ ని అమ్మడం కూడా పెద్ద సవాలే. ఈ చిత్రాన్ని వాయిదా వేయడం వల్ల 150 కోట్ల నష్టాన్ని ఇప్పటికే భరిస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత. అంతే కాదు, నిర్మాతకు ఇప్పుడు జరిగిన నష్టం తో కలిపి, ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రికవర్ అయ్యి, తన చేతుల్లోకి లాభాలు రావాలంటే ఈ చిత్రం కచ్చితంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అంత స్టామినా ఈ చిత్రానికి లేదు అనేది విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఇదొక రీమేక్ చిత్రం కాబట్టి. తెలుగు లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్.
ట్రైలర్ ని చూస్తే భగవంత్ కేసరి ని ఫైటింగ్ సన్నివేశాలతో సహా మక్కీకి మక్కి దింపినట్టుగా అనిపిస్తుంది. కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే అదనంగా జత చేశారు. అలా జత చేసిన సన్నివేశాల వల్లే ఇప్పుడు కోర్టు లో ఇన్ని రోజులు ఈ చిత్రం మగ్గాల్సి వచ్చింది. అయితే రీమేక్ సినిమాలకు కాలం చెల్లిపోయింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ‘జన నాయగన్’ విజయ్ చివరి చిత్రం గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ, అది కేవలం ఓపెనింగ్స్ ని తెచ్చి పెట్టడానికే సరిపోతుంది. కానీ లాంగ్ రన్ లో బ్రతకడం కష్టమే. ప్రస్తుతానికి ఈ చిత్రం 300 నుండి 400 కోట్ల గ్రాస్ మధ్యలోనే ఆగేలా అనిపిస్తోంది.