Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే తీవ్ర అస్వస్థతకు గురైంది. తాజాగా హైదరాబాద్ లో హీరో ప్రభాస్ హీరో ‘ప్రాజెక్ట్ కే’ రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికనే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో దీపిక పదుకొణే అస్వస్థతకు గురైంది.ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఇది అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.
ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ సమయంలో దీపిక అస్వస్థతకు గురైందని.. హార్ట్ రేట్ (గుండె కొట్టుకునే వేగం) విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆమెను హైదరాబాద్ లోని కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారని సమాచారం.
అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా షూటింగ్ లో కూడా పాల్గొంటోందని తెలిపాయి. విశ్రాంతి లేకపోవడం వల్లే దీపికకు ఇలా జరిగి ఉంటుందని వెల్లడించాయి. ఈ విషయంపై ప్రతినిధులు లేదా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
పీఆర్ టీం దీపిక అస్వస్థతపై స్పందించింది. అస్వస్థత వచ్చిన వార్తల్లో నిజం లేదని.. ఆమె జనరల్ చెకప్ కోసమే ఈ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆమె ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుందని తెలిపారు. రూమర్స్ నమ్మొద్దని వెల్లడించారు.
దీపికా పడుకొణే ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తాజా సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీపిక ‘సర్కస్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’ చిత్రంలో.. జాన్ అబ్రహం చిత్రంలోనూ.. ‘ఫైటర్’ చిత్రంలో కూడా నటిస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Deepika padukone admit hospital here the truth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com