Homeఎంటర్టైన్మెంట్Agnipariksha 2: జడ్జీలు VS మెంటర్స్..'అగ్ని పరీక్ష 2' ప్రోమో వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Agnipariksha 2: జడ్జీలు VS మెంటర్స్..’అగ్ని పరీక్ష 2′ ప్రోమో వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Agnipariksha 2: గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బంధాలు , అనుబంధాలు మధ్య ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ని తలపించడం తో , ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. పైగా ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి , ఆ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం, వారిలో ఒకరు టైటిల్ […]

Agnipariksha 2: గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బంధాలు , అనుబంధాలు మధ్య ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ని తలపించడం తో , ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. పైగా ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి , ఆ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం, వారిలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరొకరు టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడడం వంటివి జరిగాయి. అంతే కాకుండా ఈ షో నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మిగిలిన సామాన్యులు కూడా మంచి ప్రభావం చూపించారు. వారిలో దివ్య నిఖిత టీఆర్ఫీ రేటింగ్స్ కంటెంట్ ఏ రేంజ్ లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

అదే విధంగా దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్ , ప్రియా వంటి వారు కూడా బ్లాక్ బస్టర్ కంటెంట్ ని అందించారు. ఆ కంటెంట్ కారణంగా ఈ సీజన్ ఎక్కడికో వెళ్లి కూర్చుంది. ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఆ రేంజ్ ప్రభావం చూపించారు కాబట్టే , ‘అగ్నిపరీక్ష 2’ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. గతం లో లాగా కాకుండా , ఈసారి చాలా కొత్తగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. గతం లో లాగానే ఈసారి కూడా ముగ్గురు జడ్జీలు ఉంటారు , యాంకర్ గా శ్రీముఖి నే వ్యవహరించబోతుంది. అయితే ఈసారి జడ్జీలతో పాటు మెంటర్స్ కూడా ఉంటారని టాక్. ఆ మెంటర్స్ మరెవరో కాదు , గత అగ్నిపరీక్ష సీజన్ ద్వారా బిగ్ బాస్ షో కి ఎంపికై టైటిల్ విన్నర్ గా నిల్చిన కళ్యాణ్ పడాల, టాప్ 3 గా నిల్చిన డిమోన్ పవన్, షో లో బలమైన ప్రభావం చూపించిన శ్రీజ దమ్ము.

ఈ ముగ్గురు మూడు టీం లీడ్స్ గా వ్యవహరిస్తారట. వీళ్ళ టీమ్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు. సెలక్షన్ ప్రక్రియ లో ఈ మెంటర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక జడ్జీలుగా గత సీజన్ లో నవదీప్ , బిందు మాధవి , అభిజీత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నవదీప్ అందుబాటులో ఉండే అవకాశం లేదట, అదే విధంగా బిందు మాధవి కూడా వచ్చే అవకాశాలు లేవలేని అంటున్నారు. నవదీప్ స్థానం లో శివాజీ, బిందు మాధవి స్థానం లో గీత మాధురి వస్తరారట. అదే విధంగా అభిజీత్ ఈ సీజన్ లో కూడా జడ్జీగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సీజన్ కి సంబంధించిన అగ్నిపరీక్ష ప్రోమో షూటింగ్ కూడా అయిపోయిందట. ఈ నెల 7 న విడుదల ఈ ప్రోమో ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper