Rithu Chowdary Marriage: గత ఏడాది వివాదాల పరంగా రీతూ చౌదరి పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం. మీడియా చానెల్స్ లో ఈమె వివాదాలపై స్పెషల్ లైవ్ డిబేట్స్ కూడా నడిచాయి. సోషల్ మీడియా లో మొదటి నుండే బాగా పాపులర్ అయినటువంటి రీతూ చౌదరి , ఈ వివాదాల కారణంగా ఆమె పేరు బాగా ట్రెండ్ అవ్వడం తో , బిగ్ బాస్ సీజన్ 9 లోకి తీసుకున్నారు. ఈ షో ద్వారా ఆమె పై గతం లో ఏర్పడిన నెగెటివిటీ మొత్తం తొలగిపోయింది. అమాయకురాలు అని , ముక్కుసూటి తనం తో మాట్లాడే తత్త్వం ఉన్న అమ్మాయి అని, నమ్మిన వాళ్ళ కోసం నిలబడే అమ్మాయి అని, నెటిజెన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ షో ద్వారా ఆమెకు డెమోన్ పవన్ పరిచయమయ్యాడు.
ఇతనితో బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి నడిపిన ప్రేమాయణం ఎలాంటిదో కళ్లారా చూశాము. అయితే ఇదంతా షో లో కంటెంట్ కోసం చేశారు , బయటకు వచ్చిన తర్వాత రీతూ చౌదరి డిమోన్ పవన్ ని అసలు పట్టించుకోదు అని చాలా మంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ లో కంటే బయటే వీళ్లిద్దరు ఎక్కువ సన్నిహితం గా ఉన్నారు. ఇద్దరు కలిసి యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ చేశారు. అంతే కాకుండా వ్యక్తిగత జీవితాల్లో కష్టసుఖాలు కూడా పంచుకుంటున్నారు. డిమోన్ పవన్ తండ్రి చనిపోయినప్పుడు , రీతూ చౌదరి అతని పక్కనే ఉంటూ , జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిపించడం అందరి మనసులు హత్తుకునేలా చేసింది. అంతే కాకుండా రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి ‘బంగారం’ అనే పాటలో కనిపించారు. ఈ వీడియో సాంగ్ కి డిమోన్ పవన్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
ఈ వీడియో సాంగ్ లాంగ్ ఈవెంట్ రీసెంట్ గానే హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో చేశారు. ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో పాటు , టీవీ సీరియల్ ఆర్టిస్ట్స్ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రీతూ చౌదరి ని ఒక మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తూ ‘మీ జోడీ చూసేందుకు చాలా చక్కగా ఉంది , ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు?’ అని అడగ్గా, ‘పెళ్లికి అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం మేమిద్దరం ఈ రిలేషన్ లో చాలా సంతోషం గా ఉన్నాం. దీన్ని ఇలాగే ఉండనివ్వండి’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. రిపోర్టర్ మరో ప్రశ్న అడుగుతూ ‘గతంలో మీరు విష్ణుప్రియ తో చాలా సన్నిహితంగా ఉండేవారు, ఇప్పుడేమైంది?, మీ మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టు ఉంది’ అని అడగ్గా, ‘విష్ణు ప్రియ అంటే నాకు ఇప్పటికీ చాలా గౌరవం, ప్రేమ ఉంది, కానీ కెరీర్ లో బిజీ గా ఉండడం వల్ల ఈ మధ్య గ్యాప్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.