spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Vs The Paradise: పెద్ది - ప్యారడైజ్...రెండింటి పరిస్థితి ఒకేలా ఉందా..?

Peddi Vs The Paradise: పెద్ది – ప్యారడైజ్…రెండింటి పరిస్థితి ఒకేలా ఉందా..?

Peddi Vs The Paradise: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి తన సత్తా చాటబోతున్నట్టుగా తెలుస్తుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇప్పటివరకు రామ్ చరణ్ చేసినటువంటి సినిమాలను మించి ఈ సినిమాలో తన పాత్ర ఉండబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు రామ్ చరణ్ నుంచి ఒక భారీ సక్సెస్ ని ఆశిస్తుంది. కాబట్టి తను కూడా సూపర్ సక్సెస్ ని అందుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది… ఇక సోలో హీరోగా ఇప్పటివరకు రామ్ చరణ్ 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేదు. కాబట్టి ఈ సినిమాతో ఆ ఫీట్ ను అందుకోవాలని చూస్తున్నాడు. కానీ ఈ సినిమా కథ పెద్దగా ఇంపాక్ట్ కలిగించే విధంగా లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో అటు నాని, ఇటు శ్రీకాంత్ ఓదెల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

2026 మార్చి 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ మొదట్లో అనౌన్స్ చేసినప్పటికి షూటింగ్ లేటు అవుతుండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మార్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా స్టోరీ ని కూడా మార్చుకుంటూ వస్తున్నారట. అందుకే దీని మీద శ్రీకాంత్ ఓదెల అంత సాటిస్ఫై గా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రిలీజ్ అయితే గాని చెప్పలేము. ఇక పెద్ది – ప్యారడైజ్ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికి ఇప్పుడు రెండు సినిమాల పరిస్థితి ఒకేలా ఉంది. పెద్ది సినిమా కాన్సెప్ట్ పెద్దగా ఏమీ లేదని చెబుతుంటే ప్యారడైజ్ సినిమా కథని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular