Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby Movie Villain: చిరంజీవి - బాబీ సినిమాలో యంగ్ విలన్ గా ఒకప్పటి...

Chiranjeevi Bobby Movie Villain: చిరంజీవి – బాబీ సినిమాలో యంగ్ విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో…

Chiranjeevi Bobby Movie Villain: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు […]

Chiranjeevi Bobby Movie Villain: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం విపరీతమైన కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు.

గతంలో ఆయన పాన్ ఇండియా సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నాడు… ఈ మూవీ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇందులో యంగ్ విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో అయిన తరుణ్ ను తీసుకోబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయనని విలన్ గా ఏ యాంగిల్లో చూపించబోతున్నారు అనేది బాబీ కే తెలియాలి. ముందుగానే తరుణ్ చాలా సాఫ్ట్ గా ఉంటాడు. ఇక ధ్రువ సినిమాలో అరవింద స్వామి ఎలాగైతే సాఫ్ట్ విలనిజాన్ని పండించాడో అలాగే తరుణ్ సైతం స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ విషయంలో బాబీ సెలక్షన్ బాగానే ఉంది అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తరుణ్ ను ఎంచుకోవడం అనేది మంచి విషయమే… ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇప్పటి వరకు తరుణ్ హీరోగా తప్పితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించలేదు…మరి ఇప్పుడు డైరెక్ట్ విలన్ అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper