Megastar Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు భారీ విజయాలను సాధించాయి. గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న క్రమంలో మిగతా హీరోలందరు వాళ్ళ పరిధిని పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అసలు ప్లాప్ అనేది ఉండకూడదనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆచితూచి అడుగు వేస్తున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తుండటం విశేషం… నిజానికి చిరంజీవికి ఫ్లాప్ సినిమాలు వస్తే అతను దానిని స్వీకరించలేడు. ఎందుకంటే టాప్ రేంజ్ లో ఉన్నవాళ్లు ప్లాప్ సినిమాలు పడితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
కాబట్టి సక్సెస్ లను సాధించే సినిమాల వైపే అతను ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. అందుకోసమే ప్రయోగాత్మకమైన సినిమాలను చేయకుండా కమర్షియల్ సినిమాలను రొటీన్ ఫార్మాట్లో సాగే సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇది చూసిన కొంతమంది చిరంజీవి ఈ ఏజ్ లో సైతం చాలా రొటీన్ సినిమాలు కమర్షియల్ సినిమాలను చేస్తు సక్సెస్ లను సాధిస్తున్నాడు అంటుంటే, మరి కొంతమంది మాత్రం 70 సంవత్సరాల ఏజ్ లో కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయకుండా రొటీన్ సినిమా వైపే ఎందుకు మొగ్గు చూపిస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చే కమర్షియల్ సినిమాలే అతన్ని టాప్ లెవల్లో నిల్చోపెడుతున్నాయి. కాబట్టి చిరంజీవి సైతం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు…