Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఒక మామూలు మనిషి తలుచుకుంటే సినిమాల్లో హీరోగా రాణించవచ్చు మెగాస్టార్గా ఎదిగొచ్చు అని ప్రూవ్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి హీరో మరొకరు ఉండరనేది వాస్తవం… ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… 73 సంవత్సరాలు ఏజ్ లో కూడా ఆయన ఎవ్వరికి తగ్గకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి తనఎంటైర్ కెరియర్ లో చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. కానీ ఒక నటుడికి మాత్రం కెరియర్ స్టార్టింగ్ లో ఆర్థిక సహాయాన్ని అందించి అతన్ని ఆదుకున్నాడనే విషయాన్ని ఆ నటుడే స్వయంగా చెప్పడం విశేషం…
ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే శివాజీ… చిరంజీవి హీరోగా చేసి మాస్టర్ సినిమా లో శివాజీ కీలకపాత్రలో నటించాడు. అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడు శివాజీ ఇంకా ఆర్థికంగా స్థిర పడలేదు. కాబట్టి ఆ సినిమా సమయంలో తనకు వేసుకోవడానికి షూస్ కూడా లేకపోతే చిరంజీవి చూసి ఏమైంది అని అడిగారట.
అప్పుడు పక్కనే ఉన్న వేణుమాధవ్ శివాజీ ఇలా రూమ్ రెంట్ కట్టకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడట. దాంతో చిరంజీవి ఎవరికి తెలియకుండా శివాజీని పిలిచి అతనికి అప్పట్లోనే 10000 రూపాయలు ఇచ్చాడంట.
ఆ పదివేలతో దాదాపు ఆరు నెలలపాటు శివాజీ హాయిగా బతికానని కూడా చెప్పాడు. ఇక ఆ తర్వాత శివాజీ హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…