Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి…కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా స్టార్ హీరో అవ్వచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి కూడా తనే కావడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి 70 సంవత్సరాలకు పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతుండటం […]

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి…కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా స్టార్ హీరో అవ్వచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి కూడా తనే కావడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి 70 సంవత్సరాలకు పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతుండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో చిరంజీవికి బాగా నచ్చిన దర్శకులు ఎవరు అని అడగగా ఆయన ఇద్దరు పేర్లను చెప్పాడు. అందులో ఒకరు రాజమౌళి కాగా, మరొకరు సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం…

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ సినిమాలు చాలా ఎఫెక్టివ్ గా ఉంటున్నాయని రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లకు భిన్నంగా అతను సినిమాలను చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడని చెప్పాడు. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన దర్శకులలో తను మొదటి స్థానంలో ఉంటాడు.

ఆయన లేకపోతే ఈరోజు తెలుగు సినిమాలు పాన్ ఇండియా ఇండస్ట్రీ వరకు కూడా వెళ్ళేది కాదని చెబుతుంటాడు. మొత్తానికైతే రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి ఇప్పుడప్పుడే సినిమాలు చేసే అవకాశం లేదు. కానీ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ సైతం చిరంజీవితో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.

ఎందుకంటే సందీప్ చిన్నతనం నుంచి చిరంజీవి అభిమాని అయి ఉండడం అతని సినిమాలను చూస్తూ పెరగడం వల్ల అతనితో సినిమాలు చేయాలని తను చిన్నప్పటి నుంచి కొన్ని కథలను కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాడట. వాటన్నింటికీ కార్యరూపం ఇచ్చి ఇప్పుడు ఎలాగైనా సరే చిరంజీవితో సినిమా చేస్తే మాత్రం ఆ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper