టాలీవుడ్లో కొద్ది రోజులుగా బాలయ్య వర్సెస్ మెగా ఫ్యామిలీ రచ్చకు చిరంజీవి ఒక్క ట్వీట్ తో సమాధానం చెప్పారు. బాలయ్య పుట్టిన సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియాలో బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో స్టార్ వార్ ముగింపు పలికినట్లయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తన ట్వీటర్లో బాలయ్యపై తనకున్న అపాయ్యతను ట్వీట్ రూపంలో వ్యక్తపరిచారు.
‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు..ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday’ అంటూ చిరంజీవి బాలయ్యపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ను సీనిపెద్దలు కలిసినప్పుడు తనను పిలవలేదని బాలయ్య నోరుజారి భూములు పంచుకుంటున్నారా అనడంతో వివాదం నెలకొంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ లో కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటూ మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలు విడిపోయి తమ హీరోలకు సపోర్టుగా కామెంట్స్ పెడుతుండటంతో ఇదికాస్తా స్టార్ వార్ గా మారింది. అయితే ఈ ఇష్యూలో మెగాస్టార్ సైలంట్ గా ఉన్నప్పటికీ బాలకృష్ణ మాత్రం తరుచూ చిరంజీవి కామెంట్స్ చేస్తుండటంతో వివాదం సర్దుమణగలేదు.
తాజాగా చిరంజీవి బృందం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళుతున్న సమయంలో బాలకృష్ణకు ఆహ్వానం పంపారు. అయితే బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలు ఉండటంతో తాను రాలేనని చెప్పాడు. దీంతో చిరంజీవి బృందం ఏపీ సీఎంను కలిసిన సంగతి తెల్సిందే. దీంతో చిరంజీవి-బాలయ్య మధ్య వివాదం ఇంకా కొనసాగుతుండగానే మెసేజ్ అభిమానుల్లోకి వెళ్లింది. అయితే తాజాగా చిరంజీవి తన ట్వీటర్లో మా బాలయ్య అంటూ అప్యాయంగా ట్వీట్ చేయడం ద్వారా వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్లయిందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. అయితే టాలీవుడ్లో మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Chiranjeevi birthday wishes to balakrishna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com