Homeఎంటర్టైన్మెంట్నచ్చకపోతే ఛానల్ తిప్పుకోండి... నా షోలో బూతులే ఉంటాయి

నచ్చకపోతే ఛానల్ తిప్పుకోండి… నా షోలో బూతులే ఉంటాయి

ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన నాగబాబు జబర్ధస్త్ హోస్ట్ గా మారారు. ఏళ్ల తరబడి జబర్ధస్త్ జడ్జిగా చేసి, నవ్వుల బాబుగా ఫేమస్ అయ్యాడు. కొడుకు హీరోగా నిలదొక్కుకొని కోట్లు తీసుకొనే హీరోగా ఎదిగిన తర్వాత జబర్ధస్త్ నిర్మాతలపై అవాకులు చవాకులు పేల్చి… బయటి వచ్చేశాడు. జీ తెలుగులో సొంతగా అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షో లను మొదలుపెట్టారు. నాగబాబు వెళుతూ వెళుతూ చమ్మక్ చంద్ర, ఆర్పీ వంటి కొందరు కమెడియన్స్ ని తనతో పాటు […]

Bomma Adirindi
ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన నాగబాబు జబర్ధస్త్ హోస్ట్ గా మారారు. ఏళ్ల తరబడి జబర్ధస్త్ జడ్జిగా చేసి, నవ్వుల బాబుగా ఫేమస్ అయ్యాడు. కొడుకు హీరోగా నిలదొక్కుకొని కోట్లు తీసుకొనే హీరోగా ఎదిగిన తర్వాత జబర్ధస్త్ నిర్మాతలపై అవాకులు చవాకులు పేల్చి… బయటి వచ్చేశాడు. జీ తెలుగులో సొంతగా అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షో లను మొదలుపెట్టారు. నాగబాబు వెళుతూ వెళుతూ చమ్మక్ చంద్ర, ఆర్పీ వంటి కొందరు కమెడియన్స్ ని తనతో పాటు తీసుకుపోయాడు.

Also Read: రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ !

అలాగే కాంట్రవర్సీ స్కిట్స్ ద్వారా తన షోలకు ప్రచారం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య సీఎం జగన్ ని కించ పరిచేలా బొమ్మ అదిరింది షోలో స్కిట్ చేయడం జరిగింది. జగన్ అభిమానులు ఈ విషయంలో నాగబాబును తీవ్రంగా ట్రోల్ చేశారు. వాళ్ళను ఇంకా రెచ్చ గొట్టి షోకి పాప్యులారిటీ తెచ్చుకున్నారు. బుల్లితెరపై కామెడీ షోలతో ఎదగాలనుకుంటున్న నాగబాబు తాజాగా స్టాండప్ కామెడీపై ఫోకస్ పెట్టారు.

దీని కోసం కొందరు స్టాండప్ కమెడియన్స్ తో ఓ షో చేసి దాని ప్రోమో, యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఆ స్టాండప్ కమెడియన్స్ నేరుగా కొన్ని పచ్చి బూతులు మాట్లాడారు. అలాగే డబుల్ మీనింగ్ కామెడీతో రెచ్చిపోయారు. కూతురు నిహారికతో పాటు ఆ బూతు కామెడీ తెగ ఎంజాయ్ చేశాడు. దీనిపై చాలా మంది నెటిజెన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు.

Also Read: విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానంటున్న తమన్నా

దీనికి నాగబాబు గొప్ప వివరణ ఇస్తూ ఓ వీడియో చేశారు. స్టాండప్ కామెడీ హిస్టరీ చెప్పిన నాగబాబు, గొప్ప గొప్ప కమెడియన్స్ కూడా బూతులు మాట్లాడతారని అన్నాడు. మాది 18ప్లస్ కంటెంట్ అని, నచ్చక పోతే మా ఛానల్ చూడకండి, అంతేకానీ విమర్శలు చేయకండని తేల్చిపారేశారు. నేను బూతులతోనే షో చేస్తా, ఇష్టమైతే చూడండి లేకపోతే లేదని అనేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper