నేడు పార్లమెంట్ కొత్త భవనానికి భారత ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సర్వమతాల ప్రార్థనలు నిర్వహించిన అనంతరం నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం గొప్పతనం.. కొత్త పార్లమెంట్ భవనం విశేషాలను వివరించారు.
Also Read: కేసీఆర్, మోడీకి మళ్లీ విధేయుడవుతారా..?
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో త్వరలోనే కొత్త పార్లమెంట్ భవనం కొలువుదీరబోతుందని స్పష్టం చేశారు. రాబోయే వందేళ్లకు సరిపడేలా ‘సెంట్రల్ విస్టా’ పేరుతో కొత్త పార్లమెంట్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నందుకు గుర్తుగా కొత్త పార్లమెంట్ భవనం నిలుస్తుందనే ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు.
కొత్త పార్లమెంట్ భవనం మొత్తం 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుందని తెలిపారు. నాలుగు అంతస్థులు భవనం ఉంటుందని తెలిపారు. ఈ భవన నిర్మాణానికి సుమారు రూ.971 కోట్ల అంచనా అవుతుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో నిర్మించే లోక్ సభలో ప్రస్తుతం 888మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తుట్లు తెలిపారు. అలాగే భవిష్యత్ అవసరాల దృష్ట్యా మొత్తం 1,224 సభ్యులు కూర్చునేలా నిర్మాణం జరగనుందని తెలిపారు.
Also Read: ఆయనతో ఢీకొట్టే స్ట్రాటజీ ఉందా..?
ఇక రాజ్యసభలో 384మంది సభ్యులు కూర్చునేలా.. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా పెద్ద హాల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 20మంది మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని తెలిపారు.
పార్లమెంటులోని లోక్ సభ పైకప్పు పురివిప్పిన నెమలి ఆకారంలోనూ.. రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం ఆకృతిలోనూ ఉండబోతుందని.. పార్లమెంట్ అంతర్భాగం జాతీయ వృక్షమైన మర్రిచెట్టు ఉండబోతుందని తెలిపారు. ఈ కొత్త భవనం భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్