
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య వైరం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే అనేక పర్యాయాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూఆ నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. నడ్డా 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతానికి వెళుతుండగా ఓ గుంపు ఆయన కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి.