Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: అప్పుడు నాస్తికత్వం.. ఇప్పుడు సనాతనం.. నాగబాబు టార్గెట్!

Nagababu: అప్పుడు నాస్తికత్వం.. ఇప్పుడు సనాతనం.. నాగబాబు టార్గెట్!

Nagababu: రాజకీయాలు అనేవి సూటిగా చేయాలి. ఏవైనా వ్యాఖ్యలు చేయాలి అనుకుంటే దానికి అతి తెలివి ఉపయోగించకూడదు. అది ఎంత మాత్రం చేసినా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు అటువంటి పరిస్థితి ఎదురైంది. రాజా ఘాట్ ఆయన చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ ఆన్లైన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు.. తేడా కొడుతున్నాయి. నాస్తికత్వం – సనాతన ధర్మంపై నాగబాబు చేసిన కామెంట్స్ ఆయన […]

Nagababu: రాజకీయాలు అనేవి సూటిగా చేయాలి. ఏవైనా వ్యాఖ్యలు చేయాలి అనుకుంటే దానికి అతి తెలివి ఉపయోగించకూడదు. అది ఎంత మాత్రం చేసినా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు అటువంటి పరిస్థితి ఎదురైంది. రాజా ఘాట్ ఆయన చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ ఆన్లైన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు.. తేడా కొడుతున్నాయి. నాస్తికత్వం – సనాతన ధర్మంపై నాగబాబు చేసిన కామెంట్స్ ఆయన నిలకడ లేని తనాన్ని అద్దం పడుతున్నాయి అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అంత బలంగా తాను నాస్తికుడినని చెప్పిన నాగబాబు తాజాగా తనకు తాను సనాతన హిందూనని వ్యాఖ్యానించడం.. ఇప్పుడు ట్రోలింగ్ కు కారణం అవుతున్నాయి.

* అప్పట్లో దేవుడిని నమ్మనని..
అయితే నాగబాబు వైఖరి కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో ఆయన చేసిన వీడియోలు, కొన్ని రకాల వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను తప్పు పట్టేలా మారుతున్నాయి. గతంలో ఓ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు స్పందిస్తూ.. తాను దేవుడిని నమ్మబోనని అన్నారు దేవుడు లేడని పక్కాగా నిర్ణయించుకున్నానని కూడా తెలిపారు. అక్కడితో ఆయన ఆగలేదు. గతంలో తాను ఉంగరాలు పెట్టుకుని.. యజ్ఞ యాగాదులు కూడా చేసే వాడినని.. మహాభారతం, రామాయణం, వేదాలు వంటి వాటిని కూడా చదివానని చెప్పారు. కానీ ఏడు ఎనిమిదేళ్ల కింద నుంచి తాను దేవుడిని నమ్మడం లేదని.. అయితే ఈ విషయంలో తాను ఎవరిని విమర్శించని చెప్పారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఎవరి విశ్వాసాలు వారివని తెలిపారు. దేవుడు లేకపోయినా తాను మానవత్వాన్ని విశ్వసిస్తానని తెలిపారు ఆ ఇంటర్వ్యూలో.

* సనాతన హిందువునని..
అయితే తాజాగా తిరుమల లడ్డు వివాదంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతూ ఒక వీడియో విడుదల చేశారు నాగబాబు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సనాతన హిందువునని చెప్పుకొచ్చారు. అదే సమయంలో గతంలో తాను చేసిన నాస్తికవాద వ్యాఖ్యలను గుర్తు చేశారు. మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ గతంలో నేను నాస్తికుడిని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో సనాతన హిందువును అని చెప్పుకొచ్చారు. హిందుత్వం అంటే మతం కాదు అని ధర్మం అని కొత్త భాష్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. అయితే గతంలో నాస్తికత్వం.. ప్రస్తుతం సనాతనం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఇంతలోనే అంత మార్పా అంటూ సెటైరికల్ గా ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper