Bullet Bhaskar: బుల్లితెర లవర్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్. ఏళ్ల తరబడి వీరు రొమాన్స్ చేశారు. రొమాన్స్ కురిపించారు. జబర్దస్త్ వేదికగా వీరి లవ్ ట్రాక్స్ మొదలయ్యాయి. ఢీ డాన్స్ రియాలిటీ షోలో మరింత రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య డ్యూయట్స్, లవ్ స్కిట్స్ చోటు చేసుకున్నాయి. చివరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. ఒకటికి రెండుసార్లు మల్లెమాల వాళ్ళు సుధీర్-రష్మీలకు బుల్లితెర మీద పెళ్లి చేశారు. రష్మీ, సుధీర్ అంటే లవర్స్ అని జనాలు ఫిక్స్ అయ్యారు.
అందుకే రష్మీ, సుధీర్ మీడియా ముందుకు వస్తే చాలు మీ మధ్య ఏముందని అడుగుతారు. ఈ ప్రశ్నకు పలుమార్లు సమాధానం చెప్పారు. మేము స్నేహితులం మాత్రమే మా మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రష్మీ ఒకటి రెండుసార్లు అనుమానాస్పద కామెంట్స్ చేసింది. మా మధ్య ఉన్న బంధం పేరేమిటో చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తే ఇక దాపరికం అంటూ ఉండదు, అన్నారు.
వీరిద్దరికీ ఏజ్ బార్ అయ్యి చాలా కాలం అవుతుంది. పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇది కూడా వీరి ఎఫైర్ రూమర్స్ కి కారణం అవుతుంది. ఇదిలా ఉంటే బుల్లెట్ భాస్కర్ సుడిగాలి సుధీర్ రష్మీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ ఎవరు? రష్మీ నా లవర్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లెట్ భాస్కర్ ని నీకు ఎఫైర్స్ ఉన్నాయా? అని యాంకర్ అడిగింది. వెంటనే రష్మీ నా లవర్ అన్నాడు. మరి సుడిగాలి సుధీర్…? అని యాంకర్ అనగా… ఎవడండీ సుధీర్, రష్మీ నా లవర్ అన్నాడు.
ప్రసాద్ కి చెప్పి భోళా శంకర్ లో రష్మీకి ఛాన్స్ ఇప్పించాను అన్నాడు. బుల్లెట్ భాస్కర్ కామెంట్స్ కి అందరూ షాక్ అయ్యారు. అయితే ఇదంతా స్కిట్ లో భాగమే. ఎక్స్ట్రా జబర్దస్త్ లో నాటీ నరేష్, బుల్లెట్ భాస్కర్ తమ స్కిట్ లో ఈ తరహా పంచ్‌లు వేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది. బుల్లెట్ భాస్కర్ పంచ్ లకు కుష్బూ, కృష్ణభగవాన్, రష్మీ గట్టిగా నవ్వేశారు.