India Vs New Zealand Semi Final: వరల్డ్ కప్ లో ఏ టీమ్ ఎలా ఆడినా కూడా వరల్డ్ కప్ అనగానే న్యూజిలాండ్ టీమ్ మాత్రం చాలా ఉత్సాహంతో ఆడుతూ సెమీస్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది.ఇక మిగిలిన ద్వైపాక్షిక సిరీస్ లలో ఎలా ఆడినా కూడా వరల్డ్ కప్ అంటే మాత్రం న్యూజిలాండ్ టీమ్ చాలా అమితమైన ఉత్సాహాన్ని చూపిస్తుంది. ఇక 1975 నుంచి బరిలో ఉన్న న్యూజిలాండ్ టీమ్ ఇంతవరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోయిన కూడా ప్రతిసారి సెమీఫైనల్ కి రావడం అనేది న్యూజిలాండ్ టీం దక్కించుకున్న ఒక అరుదైన గౌరవంగా భావిస్తూ ఉంటుంది.
ఇప్పుడు కూడా చివరి నిమిషంలో సెమీ ఫైనల్ కి క్వాలిఫై అయిన న్యూజిలాండ్ మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియాతో తలబడబోతుంది. ఇక ఇప్పటివరకు 9సార్లు సెమీఫైనల్ కి క్వాలిఫై అయిన టీం గా న్యూజిలాండ్ టీం ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది. 1975 వ సంవత్సరంలో న్యూజిలాండ్ టీమ్ సెమీ ఫైనల్ కి వచ్చినప్పటికీ వెస్టిండీస్ టీం ని చేతిలో ఓడిపోయింది. ఇక 1979 వ సంవత్సరంలో న్యూజిలాండ్ సెమీస్ లో ఇంగ్లాండ్ టీం చేతిలో ఓడిపోయింది.
1992 వ సంవత్సరంలో పాకిస్తాన్ టీం చేతిలో ఓడిపోయింది. 1999 వ సంవత్సరంలో మళ్లీ పాకిస్తాన్ టీం షాక్ ఇవ్వడం జరిగింది. 2007, 2011 సంవత్సరంలో వరుసగా రెండుసార్లు శ్రీలంక చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. 2015, 2019 లో మాత్రం సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఇక 2015 ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడిన న్యూజిలాండ్ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని మూటకగట్టుకుంది. ఇక 2019లో ఆల్మోస్ట్ గెలిచేసింది అనుకునే స్థాయి దాకా వెళ్లి కప్పును చేజార్చుకుంది. ఇక ఇలా న్యూజిలాండ్ టీం వరుసగా వరల్డ్ కప్ సెమీస్ లోకి అడుగుపెట్టడం చూస్తుంటే న్యూజిలాండ్ కన్సిస్టెన్సీ లెవల్ చాలా అమోగం అనే చెప్పాలి…
ఇక ఇదే కాకుండా వరల్డ్ కప్ లో చాలా ప్రయోగాలు చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది.15 ఓవర్లలోపు ఫీల్డింగ్ నిబంధనలు ఉన్న ఆ సమయం లో గ్రేట్‌బ్యాచ్‌తో హిట్టింగ్ చేయించడం, దీపక్ పటేల్ లాంటి స్పిన్నర్‌ను కొత్త బంతితో బౌలింగ్ చేయించడం లాంటి ప్రయోగాలు న్యూజిలాండ్ టీమ్ ఎప్పుడో చేసింది. ఇక ఈసారి కూడా న్యూజీలాండ్ టీమ్ మొదటి నాలుగు మ్యాచ్ లు గెలిచింది. మళ్లీ వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ఆడిన ఒక మ్యాచ్ గెలిచి చివరి మినిట్ లో సెమీస్ కి వచ్చింది.ఇక ఇప్పుడు సెమీస్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లి అక్కడ కూడా గెలిచి కప్పు కొట్టాలని చూస్తుంది…