spot_img
Homeఎంటర్టైన్మెంట్మహేష్ బాబు ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ !

మహేష్ బాబు ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ !

Sandeep Reddy Vanga
అర్జున్‌ రెడ్డి అనే సినిమాతో టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేశాడు సందీప్ రెడ్డి. పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి మూడో సినిమాకే 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న డైరెక్టర్ బహుశా సందీప్ ఒక్కడే అనుకుంటా. మూడో సినిమాకి 20 కోట్లు డైరెక్టర్ గా చలామణి అవ్వడం అంటే మాటలా. పెద్ద పెద్ద డైరెక్టర్లకే తమ రేంజ్ ను పెంచుకోవడం సాధ్యం కాని ఈ రోజుల్లో.. సందీప్ తనకంటూ ఓ మార్కెట్ ఓ బ్రాండ్ ను బాలీవుడ్ లో బాగానే క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా బాలీవుడ్ లో నెట్టుకురాలేక మళ్లీ తెలుగు సినినాల వైపే వచ్చేశారు. కానీ సందీప్ ఒక్కడే.. రామ్ గోపాల్ వర్మ తరువాత అక్కడ ఆ స్థాయిలో నేమ్ తెచ్చుకుంది.

Also Read: ‘సోలో బ్రతుకే’ మిగిలిన సినిమాలకు మార్గదర్శి !

గతంలో కూడా ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాడం దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి లెజండరీ డైరెక్టర్లకే సాధ్యం కాలేదు. వాళ్ళు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసినా.. అక్కడి స్టార్ హీరోలను ఆకట్టుకోలేకపోయారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం కబీర్ సింగ్ అనే ఒక్క సినిమాతోనే ఓ రేంజ్ లో పాపులారిటీని సంపాదించాడు. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు సందీప్ తో సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ తో పాటు రణ్ బీర్ కపూర్ కూడా సందీప్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది అన్నమాట.

Also Read: పాపం డబ్బులు కోసం ‘వేదిక’ మరి ఇంతగా !

ఏమైనా తొలి సినిమాతోనే హిందీలో సందీప్ క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడంతో ఇక తన తరువాత సినిమాలను కూడా అక్కడే ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదట మహేష్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా.. స్టోరీ లైన్ కూడా వినిపించినా మహేష్ ఫుల్ స్క్రిప్ట్ అడగడం, పైగా ఇప్పట్లో మాహేష్ డేట్స్ ఇస్తాడు అనే గ్యారెంటీ కూడా లేకపోవడంతో సందీప్, మహేష్ తో అనుకున్న సినిమాని పూర్తిగా వదిలేసి.. బాలీవుడ్ లోనే మరో చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకున్నాడు. రణ్ బీర్ హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ను ఆ మధ్యే పూర్తి చేశాడు. కాకపోతే మహేష్ తో సినిమా చేశాకా.. రణ్ బీర్ తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబు ప్లేస్ లో రణ్ బీర్ వచ్చి చేరాడు. ఇక ఈ సినిమా హిట్ అయితే.. సౌత్ ఇండస్ట్రీ నుండి వెళ్లిన పాన్ ఇండియా డైరెక్టర్స్ లో సందీప్ కూడా ఒకడిగా చేరిపోతాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper