
కరోనాతో వైరస్ ప్రజాప్రతినిధులపై పంజా విసురుతోంది. దేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఎందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చనిపోయారు. తాజాగా కరోనా ధాటికి బీజేపీ రాజ్యసభ ఎంపీ తట్టుకోలేకపోయారు. గుజరాత్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ గత ఆగస్టులో కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన రాజ్ కోటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో భరద్వాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కాగా ఎంపీ మరణంపై ప్రధాని ట్విట్టర్ లో సంతాపం తెలిపారు.