Bollywood: కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. సెకండ్ వేవ్ అనంతరం అంతా సర్దుమనిగింది అనుకునే లోపు మళ్ళీ ఒమిక్రాన్ రూపంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టు అనిపిస్తుంది… నెమ్మదిగా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇటీవల పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. కాగా ఆమె ఆరోగ్యం గురించి సామ్ మేనేజర్ వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కి కరోనా సోకినట్టు తెలుస్తోంది.
కరీనాతో పాటు ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా కోవిడ్ 19 నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతుంది. కాగా వారిద్దరూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక పార్టీలకు హాజరయ్యారని తెలుస్తుంది. ఇద్దరు నటీమణులను ఇటీవల కాలంలో కలిసిన వ్యక్తులు కరోన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. కొన్నిరోజులుగా వీరిద్దరికీ కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కరీనా, అమృతా బాలీవుడ్ లో చాలా పార్టీలకు హాజరయ్యారని… అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా పాల్గొన్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు కరీనా, అమృతాలకు కరోనా పాజిటివ్ రావడంతో చాలా మంది స్టార్స్ లో టెన్షన్ వాతావరణం మొదలైంది. దీంతో రానున్న రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత మంది కోవిడ్ పాజిటివ్ గా తేలే ఛాన్స్ ఉంది. సామాన్య ప్రజల సంగతి అటుంచితే… సెలెబ్రిటీలే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bollywood actress kareena kapoor and amrutha arora got covid positive
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com