Homeఎంటర్టైన్మెంట్Nikita Rawal Viral Video: యంగ్ హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. సంచలనం...

Nikita Rawal Viral Video: యంగ్ హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. సంచలనం రేపుతున్న వీడియో..

Nikita Rawal Viral Video: ఈమధ్య కాలంలో సెలబ్రిటీల పట్ల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం చాలా కామన్ అయిపోయింది. బయటకు వస్తే చాలు , సెలబ్రిటీలకు అభిమానులు చుక్కలు చూపించేస్తున్నారు. వాళ్ళ హద్దులు మీరిన అభిమానం ఒక్కోసారి సెలబ్రిటీలకు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. అలా చిరాకు కలిగినప్పుడు సెలబ్రిటీలు అభిమానుల చెంపలు పగులగొట్టిన సందర్భాలు గతంలో మనం చాలానే చూసాము. అయితే ఎంత ఇబ్బంది కలిగించినప్పటికీ , వాళ్ళ ప్రేమని భరించే సెలబ్రిటీలను కూడా ఈమధ్య […]

Nikita Rawal Viral Video: ఈమధ్య కాలంలో సెలబ్రిటీల పట్ల అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం చాలా కామన్ అయిపోయింది. బయటకు వస్తే చాలు , సెలబ్రిటీలకు అభిమానులు చుక్కలు చూపించేస్తున్నారు. వాళ్ళ హద్దులు మీరిన అభిమానం ఒక్కోసారి సెలబ్రిటీలకు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. అలా చిరాకు కలిగినప్పుడు సెలబ్రిటీలు అభిమానుల చెంపలు పగులగొట్టిన సందర్భాలు గతంలో మనం చాలానే చూసాము. అయితే ఎంత ఇబ్బంది కలిగించినప్పటికీ , వాళ్ళ ప్రేమని భరించే సెలబ్రిటీలను కూడా ఈమధ్య కాలం లో చాలామందిని చూసాము. అలాంటి సెలబ్రిటీలలో ఒకరు నిఖిత రావెల్. ఈమెకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి , నెటిజెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా?, మీరెక్కడి నుండి వచ్చారు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక ఈవెంట్ కి హాజరైన నిఖిత రావెల్ , మీడియా కోరిక మేరకు ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ జరుగుతున్న సమయం లో ఒక అభిమాని నిఖిత వైపు దూసుకొచ్చి సెల్ఫీ తీసుకుంది. అక్కడితో ఆపేసి ఉండుంటే బాగుండేది, కానీ ఆమె ఆ తర్వాత నికిత చెంప పై ముద్దు పెట్టింది. దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించింది నిఖిత . ఆ తర్వాత నేరుగా ఆమె లిప్ కిస్ చేసింది. దీంతో ఒక్కసారి నిఖిత షాక్ కి గురైంది. అభిమానిని ఏమి అనలేక , ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సిగ్గుతో నోరు మూసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలను బయటకు రావాలంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నారుగా , ఎందుకు అభిమానులు ఈమధ్య ఇలా తయారు అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఇక నిఖిత రావెల్ విషయానికి వస్తే ఈమె ఒక బాలీవుడ్ హీరోయిన్. ముంబై లోనే పుట్టి పెరిగిన ఈమె, మోడలింగ్ రంగం ద్వారా ఫేమస్ అయ్యి , ఆ తర్వాత 2007 వ సంవత్సరం లో ‘మిస్టర్ హాట్.. మిస్టర్ కూల్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈమె ‘బ్లాక్ & వైట్’ , ‘ది హీరో – అభిమన్యు’ , ‘అమ్మా కి బోలి’ వంటి హిందీ చిత్రాల్లో నటించింది. పెద్దగా సక్సెస్ లు రాలేదు కానీ , సోషల్ మీడియా ద్వారా ఈమె బాగా ఫేమస్ అయ్యింది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈమెకు ఇలాంటి అభిమానులు కూడా ఉండడం గమనార్హం .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper