Sreeleela: శ్రీ లీల.. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది. అదే సమయంలో నటన కూడా ఇరగదీస్తుంది. అందువల్లే అప్పట్లో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. టాప్ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది. 2019లో కిస్ అనే కన్నడ సినిమా ద్వారా ఈమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం బరాటే అనే సినిమా లో కూడా నటించింది. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా 2021లో తెలుగు చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టింది. 2022లో బై టు లవ్.. అదే సంవత్సరం ధమాకా.. 2023 లో స్కంధ.. అదే సంవత్సరం భగవంత్ కేసరి.. ఆదికేశవ.. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ .. గుంటూరు కారం.. పుష్ప 2(స్పెషల్ సాంగ్), రాబిన్ హుడ్.. జూనియర్.. మాస్ జాతర.. పరాశక్తి.. వస్తాదు భగత్ సింగ్ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది. తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రంలో నటించబోతోంది.
శ్రీ లీల అందంగా ఉంటుంది. అలాగని తన పాత్ర పరిధి మేరకు మాత్రమే గ్లామర్ ప్రదర్శిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పరిధి దాటిపోదు. ఎందుకంటే తన హద్దులు తనకు తెలుసు. పైగా అసభ్యమైన పాత్రలను అస్సలు ఒప్పుకోదు. అదర చుంబనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన శ్రీ లీల అభిమానులు ఇదేంటి ఇలా అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
ఆ వీడియోలో శ్రీ లీల వేసుకున్న డ్రెస్ చాలా అభ్యంతరకరంగా ఉంది. వాస్తవానికి ఇటువంటి అవతారంలో ఆమెను ఎన్నడు అభిమానులు చూడలేదు. పద్ధతి గల దుస్తుల్లో ఆమె కనిపించారు. పైగా పాత్రల విషయంలో కూడా ఆమె అటువంటి జాగ్రత్తలే తీసుకున్నారు. కానీ, ఇటీవల సినిమాలు లేకపోవడంతో శ్రీ లీల గ్లామర్ షో చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ వీడియోలో నిజం లేదని శ్రీ లీల అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది టెక్నాలజీ సాయంతో చండాలమైన వీడియోలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీల విషయంలో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆ వీడియోను రూపొందించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా బయటికి వదులుతున్నారు. తద్వారా సెలబ్రిటీలు డ్యామేజ్ అవుతున్నారు. దేవర సినిమాలో జాన్వి కపూర్.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ.. వంటి వారి వీడియోలను టెక్నాలజీ ద్వారా రూపొందించి.. వారిని ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు శ్రీ లీలను టార్గెట్ చేశారు. వాస్తవానికి ఆమె బాలీవుడ్లో చేసినా.. మరో ఇండస్ట్రీలో సినిమాలు చేసినా తన పరిధి అస్సలు దాటదు. కానీ కొంతమంది ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ వీడియో శ్రీ లీల దృష్టికి వచ్చిందా.. వస్తే ఆమె ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.