Homeఎంటర్టైన్మెంట్Uppal Balu: స్వరం మార్చిన ఉప్పల్ బాలు.. 'బిగ్ బాస్ 10' టీం మరో బంపర్...

Uppal Balu: స్వరం మార్చిన ఉప్పల్ బాలు.. ‘బిగ్ బాస్ 10’ టీం మరో బంపర్ ఆఫర్?

Uppal Balu: ‘బిగ్ బాస్’ అనే రియాలిటీ షో లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ఎవ్వరి ఊహలకు అందని విధంగా ప్రవర్తించడమే బిగ్ బాస్ స్టైల్. అందుకే 9 సీజన్స్ ని పూర్తి చేసుకొని మరో రెండు వారాల్లో 10 వ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ […]

Uppal Balu: ‘బిగ్ బాస్’ అనే రియాలిటీ షో లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ఎవ్వరి ఊహలకు అందని విధంగా ప్రవర్తించడమే బిగ్ బాస్ స్టైల్. అందుకే 9 సీజన్స్ ని పూర్తి చేసుకొని మరో రెండు వారాల్లో 10 వ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ లో భాగంగా , సామాన్యులకు నిర్వహించిన ‘అగ్ని పరీక్ష 2’ షో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆడిషన్స్ సమయంలో ఉప్పల్ బాలు ని నవదీప్ అవమానించిన తీరు పై సోషల్ మీడియా భగ్గుమంది. ఇంత చులకన భావం తో మనుషులను ఎలా చూస్తున్నారు అంటూ నెటిజెన్స్ మండిపడ్డారు.

ఇక ఉప్పల్ బాలు అయితే బయటకు వచ్చిన తర్వాత నవదీప్ పై చేస్తున్న కామెంట్స్ ని మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాము. పాము లాగా ఇలా పగబట్టేశాడేంటి అని అంతా అనుకున్నారు. అంతే కాదు , అతని ఆవేదనలో అర్థం ఉండడంతో నెటిజెన్స్ కూడా అతనికి సపోర్టుగా నిలిచారు. అయితే రీసెంట్ గా ఉప్పల్ బాలు తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నవదీప్ గారు మీరు మొన్న కౌంటర్ ఇచ్చారు కదా, అన్ని తట్టుకుంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి రాగలరు అని, నేను అన్ని తట్టుకొనే అగ్నిపరీక్ష షో కి వచ్చాను, మీతో మాట్లాడడానికి చేతకాక కాదు. మీరు జడ్జీల స్థానం లో కూర్చున్నారు కాబట్టి , మీకు విలువ ఇవ్వాలి కాబట్టి, కొంచం తగ్గాము. ఆరోజు జరిగిన పూర్తి ఆడిషన్ ని దమ్ముంటే పెట్టండి , మీకు కావాల్సినవి మాత్రమే టెలికాస్ట్ లో పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అభిజిత్ గారు నాకు సపోర్టుగా నిలిచి గ్రీన్ ఫ్లాగ్ పైకి లేపుతుంటే మీరు అతన్ని ఎందుకు ఆపారు?, నాలాగే మీరు కూడా క్రింది స్థాయి నుండి వచ్చారు కదా, ఎందుకు నన్ను తొక్కాలని చూసారు?, నువ్వు అగ్నిపరీక్ష లో కేవలం జడ్జి మాత్రమే, ఓనర్ వి కాదు, ఓనర్లు ఎదో ఒకరోజు నాకు అవకాశం ఇస్తారు చూడండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి?, ఉప్పల్ బాలు ఇంత గట్టిగా చెప్తున్నదంటే , బిగ్ బాస్ టీం ఇతన్ని మరోసారి సంప్రదించారా? , ఆయన్ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ , సెలబ్రిటీ లీగ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రాబోతున్నారా?, అసలు ఏమి జరగబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చూడాలి మరి మన అనుమానాలు నిజం అవుతాయా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper