Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: బరితెగించిన డిమోన్ పవన్.. త్రిగున్ ని అంత పెద్ద మాట...

Bigg Boss 10 Telugu: బరితెగించిన డిమోన్ పవన్.. త్రిగున్ ని అంత పెద్ద మాట అనేశాడేంటి!

Bigg Boss 10 Telugu: గత సీజన్ లో ప్రేక్షకుల నుండి అత్యంత ఆదరణ దక్కించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు డిమోన్ పవన్. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన డిమోన్ పవన్ , మొదట్లో రీతూ తో నడిపిన లవ్ ట్రాక్ కారణంగా కాస్త గాడి తప్పాడు కానీ , ఆ తర్వాత టాస్కుల్లో తన సత్తా చాటడం తో పాటు , ఎంటర్టైన్మెంట్ లో కూడా ఇరగదీయడం […]

Bigg Boss 10 Telugu: గత సీజన్ లో ప్రేక్షకుల నుండి అత్యంత ఆదరణ దక్కించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు డిమోన్ పవన్. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన డిమోన్ పవన్ , మొదట్లో రీతూ తో నడిపిన లవ్ ట్రాక్ కారణంగా కాస్త గాడి తప్పాడు కానీ , ఆ తర్వాత టాస్కుల్లో తన సత్తా చాటడం తో పాటు , ఎంటర్టైన్మెంట్ లో కూడా ఇరగదీయడం తో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్’ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. రీసెంట్ గానే ఆయన రీతూ చౌదరి తో కలిసి చేసిన ‘బంగారం’ అనే వీడియో సాంగ్ కి 80 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది డిమోన్ పవన్ కి మొట్టమొదటి విజయం అని చెప్పొచ్చు.

అదే విధంగా ఆయన పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు . అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన హాట్ స్టార్ లో బిగ్ బాస్ 10 లైవ్ స్ట్రీమింగ్ లో ప్రేక్షకులతో కలిసి లైవ్ చిట్ చాట్ చేశాడు. ఈ చిట్ చాట్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. డిమోన్ పవన్ లో చాలా మార్పులు వచ్చాయి, హౌస్ లో కూడా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా , ఇంత అద్భుతంగా చెప్పలేదు , కానీ ఇప్పుడు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా త్రిగున్ పై నెటిజెన్స్ లో ఎంతటి ఫైర్ ఉందో , డిమోన్ పవన్ లో కూడా అంతే ఫైర్ ఉంది.

ఆయన మాట్లాడుతూ ‘త్రిగున్ రోహిత్ ని అన్యాయంగా టార్గెట్ చేయడమే కాకుండా, అతన్ని నాన్ స్టాప్ గా ట్రిగర్ చేస్తూనే ఉన్నాడు. చాలా మంది ఇండస్ట్రీ లో తెలిసిన వాళ్ళు , త్రిగున్ మంచోడని నాకు చెప్పారు, కానీ బిగ్ బాస్ లో చూస్తుంటే అలా అనిపించడం లేదు, ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిని టార్గెట్ చేయొచ్చు కానీ , ఏకంగా అగ్ని పరీక్ష షో నే ఆయన చులకన చేసాడు, నాగార్జున గారు ఇతనికి ఎల్లో కార్డు వార్నింగ్ ఇస్తాడని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ 10 లో మీకు ఎవరు బాగా నచ్చుతున్నారు అని నెటిజెన్స్ అడగ్గా , ఉన్నవారిలో రోహిత్ చాలా నచ్చాడు , చూడాలి రాబోయే రోజుల్ ఎలా ఉండబోతుంది అనేది అంటూ చెప్పుకొచ్చాడు డిమోన్ పవన్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper