Homeఅంతర్జాతీయంSamsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ ను తెచ్చుకోవచ్చు..

Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ ను తెచ్చుకోవచ్చు..

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసార సాధనం మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా కంపెనీలు రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అంతేకాదు థియేటర్ లాంటి అనుభూతి లభించే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నాయి.. టీవీల తయారీలో శాంసంగ్ కంపెనీకి తిరుగులేని మార్కెట్ ఉంది. ఈ కంపెనీ తాజాగా Samsung S9 OH OLED TV ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తద్వారా పోటీ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అంతేకాదు కస్టమర్లకు అదిరిపోయే […]

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసార సాధనం మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా కంపెనీలు రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అంతేకాదు థియేటర్ లాంటి అనుభూతి లభించే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నాయి..

టీవీల తయారీలో శాంసంగ్ కంపెనీకి తిరుగులేని మార్కెట్ ఉంది. ఈ కంపెనీ తాజాగా Samsung S9 OH OLED TV ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తద్వారా పోటీ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అంతేకాదు కస్టమర్లకు అదిరిపోయే అనుభూతి ఇచ్చే విధంగా అందులో ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ టీవీలో ఉన్న ఫీచర్లు ఏంటి.. ధర ఎంత అంటే..

ముఖ్యమైన ఫీచర్లు

Glare free mat coating: ఈ మోడల్ లో సరికొత్త యాంటి రిఫ్లెక్టివ్ మ్యాట్ కోటింగ్ వల్ల గదిలో కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతి లేదా విద్యుత్ దీపాల వెలుతురు స్క్రీన్ పై పడితే అది ప్రతిబింబించదు. కాబట్టి వెల్తురు ఎక్కువగా ఉండే గదుల్లో ఇది అద్భుతమైన థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

Nq4 zen3 processor: ఇందులో ఉపయోగించిన 128 AI న్యూరల్ నెట్వర్క్ ప్రాసెసర్ సాధారణ కంటెంట్ ను కూడా అద్భుతమైన 4K క్వాలిటీతో అప్ స్కేల్ చేయగలుగుతుంది.

Display & picture quality: OLED + HDR + సపోర్ట్ తో పాటు సెల్స్, ఎలిమినేటింగ్ పిక్సెల్స్ ఇందులో ఉంటాయి. అందువల్ల పర్ఫెక్ట్ బ్లాక్ కలర్స్.. అద్భుతమైన కాంట్రాస్ట్, వైబ్రేట్ కలర్స్ ఇందులో లభిస్తాయి.

Ultimate gaming pack: గేమర్ల కోసం ఈ టీవీలో 165 HZ రీ ఫ్రెష్ రేట్ ఇందులో లభిస్తుంది. ఇందులో అతి తక్కువ ఇన్పుట్ లాగ్, AMD free Sync premium Pro, NVDIA G SYNC సపోర్ట్ ఇందులో ఉన్నాయి.

Audio: 40 W సామర్థ్యం ఉన్న 2.1 ఛానల్ స్పీకర్లు, dolby atmos సౌండ్ టెక్నాలజీ ఇందులో ఉండడంతో థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది.

Operating system: సాంసంగ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం మీద ఇది ఆధారపడి పని చేస్తుంది. దీంతోపాటు సాంసంగ్ విజన్ ఏఐ కంపానియన్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.

  • మనదేశంలో సామ్ సంగ్ తీసుకొచ్చిన మోడల్స్ ధరలు
  • QA48S90HAELXL(48 ఇంచులు)1,19,990
  • QA55S90HAULXL(55 ఇంచులు) 1,41,900-1,51,690
  • QA65S90HAELXL(65 ఇంచులు) 1,82,000-2,02,290
  • QA77S90HAULXL(77 ఇంచులు) 3,64,990
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper