Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ మొదలు అవ్వడానికి పట్టుమని 10 రోజులు కూడా లేదు. గతం లో ఏ సీజన్ కి కూడా ఇంత క్రేజ్ ఉండేది కాదు. ఈ సీజన్ కి ప్రత్యేకించి ఇంత క్రేజ్ ఎందుకంటే, గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లే. దానికి తోడు ‘అగ్ని పరీక్ష 2’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రతీ రోజు సోషల్ మీడియా లో ఈ షో కి సంబంధించిన వీడియోలు ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు బాహుబలి లాగా ఉన్నారు. వీళ్ళని తట్టుకొని పాపం సెలబ్రిటీలు నిలబడగలరా? అనే అనుమానం ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతోంది. ఆ స్థాయిలో ఆడుతున్నారు అన్నమాట. అయితే సెలబ్రిటీల కంటెస్టెంట్స్ జాబితా దాదాపుగా ఖరారు అయ్యింది.
ముకేశ్ గౌడ, దేబ్ జాన్ మెదక్, ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ పొట్టి నరేష్, యాంకర్ వర్షిణి, కృష్ణుడు, చైత్ర రాయ్, టెంపర్ వంశీ తదితరులు ఈ షో లో పాల్గొనేందుకు అగ్రిమెంట్ మీద కూడా సంతకాలు చేశారట. అయితే ఇద్దరు క్రేజీ సీరియల్ హీరోయిన్స్ మాత్రం చివరి నిమిషం లో ఈ షోలో పాల్గొనడానికి నో చెప్పారట. వాళ్ళు మరెవరో కాదు ఆషికా పదుకొనే, పల్లవి గౌడ. వీళ్లిద్దరు కచ్చితంగా ఈ షోలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ టీం వీళ్ళని సంప్రదించారట కూడా. కానీ రెమ్యూనరేషన్ విషయం లో వీళ్ళు వెనక్కి తగ్గకపోవడం వల్ల, బిగ్ బాస్ టీం వేరే వాళ్ళ వైపు తమ ద్రుష్టిని షిఫ్ట్ చేశారు. సీరియల్స్ ద్వారా వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో , ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి స్టార్ మా ఛానల్ లో బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకున్న ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో కుక్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన వంటకాలు వండిస్తూ , వీళ్లిద్దరు పంచిన ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇస్తే , కేవలం వీళ్ళ కోసమైనా ఆ షో ని చూడాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరు రావడం లేదనే విషయం తెలుసుకొని బాధ పడుతున్నారు. వీళ్ళతో పాటు ప్రముఖ సినిమా హీరోయిన్ సీరత్ కపూర్, సుహాసిని వంటి వారిని కూడా సంప్రదించారట. చివరి నిమిషం లో వీళ్లంతా తప్పుకున్నారు.