Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10 ' లో కంటెస్టెంట్స్ అలాంటి పనులు...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10 ‘ లో కంటెస్టెంట్స్ అలాంటి పనులు చేస్తే 10 లక్షలు జరిమానా..!

Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఫెవర్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. గత ఏడాది లాగానే ఈ ఏడాది లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ షో లోకి పంపబోతున్నారు. అందుకోసం ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. భారీ రేంజ్ లో అప్లికేషన్స్ వస్తాయని ఊహించారు […]

Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఫెవర్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. గత ఏడాది లాగానే ఈ ఏడాది లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ షో లోకి పంపబోతున్నారు. అందుకోసం ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. భారీ రేంజ్ లో అప్లికేషన్స్ వస్తాయని ఊహించారు కానీ , ఆ రేంజ్ లో మాత్రం రాలేదు. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా 8 మంది సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. సెలబ్రిటీల జాబితా 12 నుండి 14 మంది వరకు ఉండొచ్చు. ఈసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను దించాలనే చూస్తున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. గత సీజన్స్ లో నేరుగా ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం వంటివి కూడా మనం కళ్లారా చూశాము. ముఖ్యంగా ఇలాంటి షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తుంటారు , వాళ్లకు ఇలాంటి బూతులు వినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే కాకుండా గత సీజన్స్ లో మతాల కార్డుని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు , అదే విధంగా తెలుగు వెర్సస్ కన్నడ వాదన కూడా తీసుకొచ్చారు. ప్రతీ సీజన్ కి ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం బిగ్ బాస్ టీం ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక గాసిప్ వినిపిస్తోంది. అదేమిటంటే బూతులు మాట్లాడిన, ఫిజికల్ గా ఎవరిపైన అయినా చెయ్యి చేసుకున్నా , విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తించిన జరిమానా భారీ రేంజ్ లో విధించబోతున్నారని టాక్.

రెమ్యూనరేషన్ నుండి రెండు , మూడు వారాలు కట్ చేయడమో , లేదంటే 10 లక్షల రూపాయిల రేంజ్ లో జరిమానా విధించడమో జరుగుతుందట. మన సీజన్స్ లో ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా కొట్టడం వంటివి జరగలేదు కానీ , తమిళ , హిందీ బిగ్ బాస్ సీజన్స్ లో మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అక్కడి హోస్టులు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసేవారు. మన తెలుగు బిగ్ బాస్ లో రెడ్ కార్డు మాత్రమే కాకుండా, ఇలా జరిమానా కూడా విధించాలని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper