Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur movie : సత్యదేవ్ 'రావు బహదూర్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు...

Rao Bahadur movie : సత్యదేవ్ ‘రావు బహదూర్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..

రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న కొత్త సినిమాల్లో , ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘రావు బహదూర్’. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలని తపన పడే సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో గా నటించగా, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి […]

రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న కొత్త సినిమాల్లో , ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘రావు బహదూర్’. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలని తపన పడే సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో గా నటించగా, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడమే కాదు , ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ని కూడా అందించారు. ఇలా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. సత్యదేవ్ కి సోలో హీరో గా ఇప్పటి వరకు స్థిరమైన మార్కెట్ లేదు అనేది వాస్తవం.

ఆయన నటించిన సినిమాలకు ఓటీటీ లో మంచి ఆదరణ దక్కాయి కానీ , థియేట్రికల్ ఆదరణ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడం తో పాటు , వెంకటేష్ మహా , సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా అంటే , అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది సాధారణమైన విషయం కాదు. టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను కూడా రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో డైరెక్టర్ వెంకటేష్ మహా ఇచ్చే కొన్ని ట్విస్టులకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంటి బాబు , అసలు ఊహించలేకపోయాము, టేకింగ్ లో ఇది మాస్టర్ పీస్ రేంజ్ అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. హీరో సత్య దేవ్ ‘రావు బహదూర్’ లో అంతకు మించిన ట్విస్టులు , షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే కనుక నిజమైతే , బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ ని సృష్టించబోతోంది అనొచ్చు , అందులో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper