Homeఎంటర్టైన్మెంట్Prakash Raj: జస్ట్ ఆస్క్ మీ...టాలీవుడ్ లో మరో కొత్త ఉద్యమం...

Prakash Raj: జస్ట్ ఆస్క్ మీ…టాలీవుడ్ లో మరో కొత్త ఉద్యమం…

Prakash Raj: ప్రస్తుతం సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు సమాజంలో జరిగే ప్రతి విషయం మీద స్పందిస్తూ వల్ల అభిప్రాయాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు… ఒక సంఘటన మీద ఎవరి అభిప్రాయాలను వాళ్ళు తెలియజేస్తున్నారు. అందులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది మనం నిర్ణయించలేము…సామాన్య ప్రజలు వాళ్ల అభిప్రాయాలను తెలుపడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ మాటలను ఫాలో అయ్యే వాళ్ళు గాని, పట్టించుకునే వాళ్లు గాని ఎవరు […]

Prakash Raj: ప్రస్తుతం సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు సమాజంలో జరిగే ప్రతి విషయం మీద స్పందిస్తూ వల్ల అభిప్రాయాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు… ఒక సంఘటన మీద ఎవరి అభిప్రాయాలను వాళ్ళు తెలియజేస్తున్నారు. అందులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది మనం నిర్ణయించలేము…సామాన్య ప్రజలు వాళ్ల అభిప్రాయాలను తెలుపడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ మాటలను ఫాలో అయ్యే వాళ్ళు గాని, పట్టించుకునే వాళ్లు గాని ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో నటులుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది సొసైటీలో జరిగే ప్రతి విషయం మీద ‘జస్ట్ ఫర్ ఆస్కింగ్’ అంటూ వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీనివల్ల కొంతమంది నటులు ప్రేక్షకుల నుంచి తీవ్రమైన విమర్శలను సైతం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు లాంటి నటుడు దేశంలో జరిగే రాజకీయ పరిణామాల మీద జస్ట్ ఫర్ ఆస్కింగ్ అంటూ ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. దానికి జనాలు సైతం అదే రేంజ్ లో ఆన్సర్ ఇస్తున్నారు. దీనివల్ల ఆయన చాలా వరకు తన ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ అంటే విలక్షణమైన నటుడిగా మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ తీవ్రమైన వివాదాలకు తెరలేపుతున్నాడు.

ఏది ఏమైనా కూడా ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరమైతే ఉందని కొంతమంది సినీ మేధావులు చెబుతున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ సైతం తెగేసి ఏదో ఒకటి మాట్లాడి వీడియో రికార్డు చేసి అప్లోడ్ చేస్తారు…

దాని గురించి ఒక రెండు మూడు రోజులు చర్చ జరుగుతుంది… అలాగే రాహుల్ రామకృష్ణ సైతం తనకు ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్స్ చేస్తూ మళ్ళీ వాటిని డిలీట్ చేస్తుంటాడు. దానివల్ల ఆయన రాజకీయపరంగా కూడా చాలా వరకు విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఏది ఏమైనా కూడా వీళ్ళందరు నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కాబట్టి వాళ్లు ఏదైనా చెబితే సొసైటీ దాన్ని అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా కూడా ఆచితూచి ఒకటికి పది సార్లు ఆలోచించి చెబితే మంచిదని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper