VFX Tollywood: ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తున్న ప్రతి సినిమా కూడా విఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉంటుంది. చాలా సన్నివేశాలను సీజీ లో క్రియేట్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు సైతం వాళ్లు చేసే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూనే సీజీ వర్క్ ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటున్నారు. ప్రేక్షకులకు విజువల్ వండర్స్ ని అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక చర్యకి పాల్పడుతున్నారని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక విశ్వంభర సినిమాని కనక మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయాయి. ఈ సినిమా షూటింగ్ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ అంత సర్టిఫైడ్ గా ఉండడం లేదు. ముందుగా ఒక కంపెనీకి గ్రాఫిక్స్ పనులు చేయమని ప్రాజెక్ట్ ని అప్పజెప్పినప్పటికి వాళ్ళు చేసిన వర్క్ పట్ల సినిమా యూనిట్ అంత సాటిస్ఫైడ్ గా లేదు. అందువల్ల వాళ్ల నుంచి ఆ ప్రాజెక్టును తీసుకొని వేరే కంపెనీకి అప్పగించారు.
దీని వల్ల సినిమా క్వాలిటీ పెరుగుతుందేమో కానీ సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతుంది. తద్వారా ప్రొడ్యూసర్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. మొదట సీజీ వర్క్ చేసిన కంపెనీకి డబ్బులు పే చేస్తూనే సెకండ్ టైం సీజీ వర్క్ చేస్తున్న కంపెనీకి కూడా డబ్బులను ఇవ్వాలి. అలాగే సినిమా లేట్ అవుతున్నందుకు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తెచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతోంది.
దీని వల్ల సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క సినిమా తీయడానికి రెండు సినిమాలకు అయ్యే ఖర్చును భరించాల్సి వస్తుంది. దీనివల్ల సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా ప్రొడ్యూసర్లకు భారీ లాభాలైతే రావడం లేదు. ఈ విషయంలో మన స్టార్ డైరెక్టర్లు హీరోలు చాలా వరకు కేర్ఫుల్ గా వ్యవహరిస్తే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సీజీ వర్క్ లేకుండా సినిమాలు చేయలేమా అంటే చేయొచ్చు… కానీ ప్రేక్షకుడికి విజువల్ వండర్స్ ని అందించాలనే ప్రయత్నంలోనే మన హీరోలు దర్శకులు ఉన్నారు. కాబట్టి ఇది సినిమాలో చాలా కీలకమైన అంశంగా మారిపోయింది. నిజానికి మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు ఎలాంటి సీజీ వర్క్ లేకుండా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…