Homeఎంటర్టైన్మెంట్Prabhakar Son Chandrahas: సీరియల్ లో అలా..నిజ జీవితంలో ఇలా..కొడుకు విషయంలో ప్రభాకర్ తీరులో ఇంత...

Prabhakar Son Chandrahas: సీరియల్ లో అలా..నిజ జీవితంలో ఇలా..కొడుకు విషయంలో ప్రభాకర్ తీరులో ఇంత మార్పా?

Prabhakar Son Chandrahas: టెలివిజన్ రంగం లో సీనియర్ గా పేరొందిన నటుడు ప్రభాకర్. మొదట్లో ఈటీవీ లో రామోజీ రావు తనయుడు సుమన్ తో కలిసి ఎన్నో టీవీ షోస్ లో భాగస్వామిగా వ్యవహరించాడు. ఆ తర్వాత పలు షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వడమే కాకుండా, బుల్లితెర మెగాస్టార్ గా మంచి […]

Prabhakar Son Chandrahas: టెలివిజన్ రంగం లో సీనియర్ గా పేరొందిన నటుడు ప్రభాకర్. మొదట్లో ఈటీవీ లో రామోజీ రావు తనయుడు సుమన్ తో కలిసి ఎన్నో టీవీ షోస్ లో భాగస్వామిగా వ్యవహరించాడు. ఆ తర్వాత పలు షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వడమే కాకుండా, బుల్లితెర మెగాస్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు రీసెంట్ గా ఆయన స్టార్ మా ఛానల్ లో పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వయ్వహారించి, సూపర్ హిట్స్ ని అందుకొని భారీ లాభాలను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సీరియల్ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

సోమవారం నుండి శనివారం వరకు ప్రతీ రోజు రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ లో ప్రభాకర్ నలుగురు పిల్లలకు తండ్రిగా కనిపిస్తాడు. చాలా క్రమశిక్షణ తో వాళ్ళని పెంచి పెద్ద వాళ్ళను చేసి పెళ్లి చేస్తాడు. గౌరవ మర్యాదల విషయం లో పిల్లలకు చిన్నతనం నుండే చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ సమాజం లో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తాడు. అందుకే ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అయ్యింది. అయితే సీరియల్ లో పిల్లల పట్ల అంత స్ట్రిక్ట్ గా కనిపించిన ప్రభాకర్, నిజ జీవితం లో ఎందుకో తన కొడుకు పట్ల అంత స్ట్రిక్ట్ గా వ్యవహరించినట్టు లేడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. రీసెంట్ గానే ఆయన కొడుకు చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన బూతు పాట ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇప్పటికీ ఈ విషయం పై విమర్శలు, చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నేను నా బిడ్డని ఎంతో క్రమశిక్షణ గా పెంచాను అని, ఎదో సినిమా కోసం పొరపాటున అలా చేసాడని, వాడు చేసింది తప్పే కానీ, వాడిని, మమ్మల్ని బూతులు తిడుతూ సోషల్ మీడియా లో కొంతమంది ఇంకా పెద్ద తప్పులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మా వాడు ఆ బూతు పాట పాడినప్పుడు నేను అక్కడ లేను, ఒకవేళ ఉండుంటే పాడనిచ్చేవాడిని కాదు, ఈవెంట్ అయిపోయిన తర్వాత నాకు ఈ విషయం తెలిసి అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పానంటూ ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. కానీ పాడితే నా తండ్రి నుండి కచ్చితంగా తిట్లు ఉంటాయి అనే భయం చంద్రహాస్ లో ఉండుంటే, నిజంగా ఇలా చేసేవాడా?, అతనికి తండ్రి అంటే భయం లేదు, ప్రభాకర్ అతనికి అన్ని విషయాల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు అనే విషయం అర్థం అవుతోంది, అందుకే ఇలా చేశాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper