Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి ఆ విషయంలో క్లారిటి మిస్ అవుతున్నాడా..?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఆ విషయంలో క్లారిటి మిస్ అవుతున్నాడా..?

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. తన నుంచి వచ్చిన ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా స్టార్ హీరోలు అందరికి సక్సెస్ లను కట్టబెడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతనికి సక్సెసులైతే వస్తున్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన పూర్తిగా డీలా పడిపోతున్నాడు… ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. దీనివల్ల ఆయన ఒక వర్గం ప్రేక్షకులను మొత్తానికి మెప్పించలేకపోతున్నాడు. ఎంతసేపు రొటీన్ కామెడీతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. కానీ జెన్యూన్ కామెడీని మాత్రం తన సినిమాలో చూపించే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు జంధ్యాల ఇవివి సత్యనారాయణ సిచువేషనల్ కామెడీని చాలా హైలెట్ చేస్తూ చూపించేవారు. కానీ అనిల్ రావిపూడి సినిమాలో మాత్రం ఆ కామెడీ అంతా పెద్దగా ఎలివేట్ అవ్వడం లేదు. తన సిచువేషన్ కామెడీ చేస్తున్నాను అంటూ చెప్పినప్పటికి అది అన్ని వేల వర్కౌట్ అవ్వడం లేదు.

ఇక దాంతో పాటుగానే ఎప్పుడు రొటీన్ రొట్టా కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. తద్వారా కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను తను మెప్పించలేకపోతున్నాడు. ఇక ఇప్పటికైనా ఆయన కొత్తగా ఆలోచించి చాలా డిఫరెంట్ గా రాసి ప్రేక్షకులను మెప్పించగలిగితే బాగుంటుంది. అంతే తప్ప ఈయన రొటీన్ కామెడీని రాస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు.

ప్రస్తుతం ఉన్న దర్శకులందరు పాన్ ఇండియా రేస్ లో ముందుకు దూసుకెళ్తుంటే అనిల్ రావిపూడి మాత్రం చాలా సింపుల్ గా ఫ్యామిలీ కథలతో వచ్చి సంక్రాంతికి హిట్టు కొట్టి వెళ్తున్నాడు… దీనివల్ల ప్రేక్షకుల్లో అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది గాని, అనిల్ రావిపూడి మీద పెద్దగా అంచనాలైతే పెట్టుకోవడం లేదు…

ఆయన సినిమాలను ఒకసారి చూసి వదిలేస్తున్నారు. సినిమాలో పెద్దగా మేటర్ ఉండకపోవడం వల్లే ఇలాంటి మైనస్లు జరుగుతున్నాయని ఇకమీదట వచ్చే సినిమాలతో ఆ మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper